Pawan Kalyan Instagram: సోషల్ మీడియా లో అత్యంత పవర్ ఫుల్ మీడియా ఏదైనా ఉందా అంటే అది ఇంస్టాగ్రామ్ అనే చెప్పొచ్చు. నేటి తరం యువత మొత్తం ఇంస్టాగ్రామ్ ని ఒక రేంజ్ లో వాడేస్తున్నారు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ యాప్స్ ని ఎంత వరకు వాడుతారో తెలియదు కానీ, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లేని వాడు అంటూ ఎవ్వరూ ఉండరు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఇంస్టాగ్రామ్ లో మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఉన్నారు.
మహేష్ బాబు , చిరంజీవి , ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ఇలా ప్రతీ ఒక్కరు ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టలేదు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ యాప్స్ లో కూడా ఉన్నాడు కానీ, అత్యంత పవర్ ఫుల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో మాత్రం లేడు.
ఇప్పుడు ఆ లోటు కూడా తీరనుంది, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో లేకపోయినప్పటికీ కూడా, ఆయన పేరు మీద మిలియన్ల కొద్దీ పోస్టులు పడుతూ ఉండేవి. టాలీవుడ్ లోనే ఇంస్టాగ్రామ్ లో అత్యంత మెన్షన్స్ కలిగి ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కానీ లేదా రేపు కానీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు, మెగా బ్రదర్ నాగబాబు అధికారికంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఇది నిజంగా అభిమానులకు పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. సోషల్ మీడియా లో ఉన్న అన్నిటికంటే ఇంస్టాగ్రామ్ అత్యంత పవర్ ఫుల్ మీడియా. ఏ సమాచారం అయినా నిమిషాల వ్యవధి లో ప్రపంచం మొత్తం పాకేస్తాది.
అలాంటి ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతుండడం అభిమానులకు నిజంగా పండుగ లాంటి వార్తే అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ తన ఈ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా రాజకీయ వ్యవహారాల కోసమే వాడుతాడట. సౌత్ లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించిన అతి 99 నిమిషాలలోనే 1 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ని దక్కించుకున్న ఏకైక హీరో ఇలయథలపతి విజయ్. మరి ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.