https://oktelugu.com/

Pawan Kalyan- Adipurush Movie: ఆదిపురుష్’ థియేటర్స్ లో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే వార్త.

ఇప్పుడు ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ సంస్థ. రేపు తిరుపతి లో జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవినీ ఎరుగని రీతిలో జరిపించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సుమారుగా రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పవన్ కళ్యాణ్ తో 'బ్రో ది అవతార్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : June 5, 2023 / 08:11 AM IST

    Pawan Kalyan- Adipurush Movie

    Follow us on

    Pawan Kalyan- Adipurush Movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 180 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు చేసింది.

    ఇప్పుడు ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ సంస్థ. రేపు తిరుపతి లో జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవినీ ఎరుగని రీతిలో జరిపించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సుమారుగా రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి గట్టి ప్రొమోషన్స్ ఇప్పటి వరకు ప్రారంభించలేదు, దీనిపై ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మొదటి నుండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. టీజర్ కోసం ప్రతీ రోజు అడుగుతూనే ఉన్నారు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రో చిత్రం కోసం మామూలు ప్లానింగ్ చెయ్యలేదు. ఈ సినిమా టీజర్ ని ఇది వరకే కట్ చేసి పెట్టి ఉన్నారట.రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ని ‘ఆదిపురుష్’ సినిమాతో అటాచ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

    ఇప్పటి వరకు ఈ చిత్రం పై ఫ్యాన్స్ లో పెద్దగా అంచనాలు లేవు, కానీ ఈ టీజర్ వచ్చిన తర్వాత మాత్రం చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తాయని అంటున్నారు, పైగా ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా రీచ్ ఉన్న సినిమాతో అటాచ్ చేసి విడుదల చెయ్యడం వల్ల కచ్చితంగా ఈ సినిమా రీచ్ గ్రౌండ్ లెవెల్ లో బలంగా వెళ్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.