Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh - Jr NTR : లోకేష్ కంటే ముందే జూ.ఎన్టీఆర్ సీఎం అవుతాడా?

Nara Lokesh – Jr NTR : లోకేష్ కంటే ముందే జూ.ఎన్టీఆర్ సీఎం అవుతాడా?

Nara Lokesh – Jr NTR : టీడీపీలో జూనియర్ ఎంట్రీ.. ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఇది. కానీ ప్రస్తుతానికి తనకు రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని తారక్ నిర్మోహమాటంగా చెబుతున్నారు. రాజకీయ వేదికలను పంచుకోవడం లేదు.  రాజకీయాల గురించి అస్సలు మాట్లాడడం లేదు. అయినా తరచూ తారక్ పేరు వినిపిస్తునే ఉంది. నందమూరి హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆశిస్తున్నారు. కానీ ఆయన మాత్రం పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. చివరకు తాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తో ఉన్నగ్యాపే కారణమని విశ్లేషణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు పీవీఆర్ నరసింహరావు జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2009 ఎన్నికల్లో స్వయంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఏపీలో రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా తారక్ ఎక్కడా కనిపించలేదు. అసలు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. సినీ కెరీర్ పై దృష్టిపెట్టారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. మరో 15 సంవత్సరాలు సినీరంగంలో ఉండాలని భావిస్తున్నారు. అటు తరువాతే రాజకీయరంగం గురించి ఆలోచన చేస్తారని ఆయన క్లోజ్ సర్కిల్ వ్యక్తులు చెబుతున్నారు.

నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను సైడ్ చేశారన్న టాక్ ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే లోకేష్ చరిష్మా తక్కువే. వాగ్ధాటి కూడా అంతంతమాత్రమే. అయినా ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి లోకేష్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో జ్యోతిష్యుడు నరసింహరావు చేసిన ట్వట్ ఆసక్తికరంగా మారింది.

నందమూరి హరికృష్ణకు అత్యంత సన్నిహితుల ద్వారా తారక్ జాతకం పొందానని.. ఆయన భవిష్యత్ భేషుగ్గా ఉందన్నారు. ప్రజాదరణ మెండుగా ఉంటుందని చెప్పారు. మరో 15 ఏళ్లలో విపరీతమైన ప్రజాదరణ పెంచుకుంటారని చెప్పుకొచ్చారు. నాయకత్వ లక్షణాలు, ప్రతి విషయంపై అవగాహన ఆయనకు ప్లస్ గా నిలుస్తాయని చెప్పారు. తాత మాదిరిగా సినీ సమ్మోహన శక్తితో రాజకీయంగా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేష్ జాతక రీత్యా ఆయన ఎంత కష్టపడినా.. పదేళ్లలో సీఎం అయ్యే చాన్స్ లేదని తేల్చేశారు. లోకేష్ చాలా తెలివైనవాడని..కానీ భావోద్వేగాలు వ్యక్తం చేయడంలో తారక్ అంత పరిణితి సాధించలేరన్నారు. తారక్, లోకేష్ లు కలిసే చాన్స్ కూడా లేదని తేల్చారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టు.. ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతుందని నరసింహరావు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. నెట్టింట్లో ఇది తెగ వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version