Allu Arjun Trivikram Movie: టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’,’అలా వైకుంఠపురం లో’ వంటి సినిమాలు వచ్చాయి. వీటిల్లో ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో నాల్గవ సినిమా రాబోతుందని, కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి మరికొన్ని క్రేజీ రూమర్స్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పది నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్ర చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది, ఇదే కనుక జరిగితే నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవ్వడం ఖాయం అనే చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రీ ఎంట్రీ తర్వాత ఆయన సినిమాలన్నీ కూడా త్రివిక్రమ్ దగ్గరుండి మరీ సెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చివరి చిత్రం భీమ్లా నాయక్ కి అనధికారిక దర్శకుడు త్రివిక్రమే. ఇక ఇప్పుడు రీసెంట్ గా విడుదల అవ్వబోతున్న పవన్ లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ కి కూడా ఆయన మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ప్రస్తుతం పవర్ స్టార్ కెరీర్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న #OG చిత్రాన్ని కూడా ఆయనే సెట్ చేసాడు, ఇలా ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి మ్యానేజర్ లెక్క మారిపోయాడు. అందుకే త్రివిక్రమ్ రిక్వెస్ట్ చెయ్యగానే పవన్ కళ్యాణ్ వెంటనే ఒప్పుకున్నాడని టాక్. ఇది ప్రస్తుతానికి అనధికారిక ప్రకటన మాత్రమే, ఒకవేళ నిజం అయితే మాత్రం అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పొచ్చు.