Manchu Vishnu-Pawan Kalyan: ప్రతి దసరాకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. ఈసారి దసరా పండుగ రెండో రోజు అలయ్ బలయ్ కొనసాగింది. జలవిహార్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులు చాలామంది హాజరయ్యారు. దుర్గామాత, జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ పూజలు చేశారు.

అలయ్ బలయ్ కార్యక్రమంపై దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమం ఇదేనన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పండుగకు దూరంగా ఉన్నా ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గడంతో పండుగను ఘనంగా జరుపుకునే అవకాశం దక్కింది.
వేదిక మీద పలువురు ప్రముఖులు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, రెడ్డి లేబరేటరీస్ అధినేత ప్రసాద్ రెడ్డి, ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, నటుడు కోట శ్రీనివాస్ రావు కూర్చున్న వీడియోను విష్ణు పోస్టు చేశారు. అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు.
దీంతో నటుల్లో అభిప్రాయ భేదాలు లేవని పైకి చెబుతూనే లోపల మాత్రం వారిలో కూడా మనస్పర్ధలు ఉన్నాయని రుజువు చేస్తున్నారు. మంచు విష్ణు పలకరించినప్పుడు పవన్ కల్యాణ్ ముఖం తిప్పుకోవడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎన్నికల్లోనే పార్టీలు కానీ తరువాత అందరం ఒకటే అని చెప్పే నటులు బయట కూడా రాగద్వేషాలు చూపించడం సబబుకాదని కొందరి వాదన. మంచు విష్ణు మాట్లాడినప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుండేదని పలువురి అభిప్రాయం.