
Nandamuri Balakrishna: నటసింహం బాలయ్య తన ‘అఖండ’ సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం అఖండ కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు. అందుకే, తన తర్వాత సినిమాలోనైనా కొత్త క్యారెక్టర్ ట్రై చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నాడు. బాలయ్య తన తర్వాత సినిమాని షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు.
కాగా బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో బాలయ్య కోసం ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను గోపీచంద్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఓ స్వామీజీ గెటప్ లో బాలయ్య(Nandamuri Balakrishna) ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. పైగా ఈ పాత్రను రాసింది కూడా బాలయ్యనే. గోపీచంద్ కథ చెప్పిన తర్వాత.. ఈ కథలో ఒక కొత్త పాత్రను యాడ్ చేస్తాను అంటూ బాలయ్య ఈ స్వామీజీ పాత్రను యాడ్ చేశారట.
మొత్తానికి బాలయ్య, అఘోరాలు, స్వామీజీల పై పడ్డాడు. అయితే, ఇలాంటి పాత్రలు చేసినప్పటికీ ఆ పాత్రలు కొంతవరకే సినిమాలో కనిపిస్తాయి. ఇక మిగతా సినిమా మొత్తం బాలయ్య అభిమానులకు నచ్చే విధంగానే ఉంటుంది. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి తారక్ రత్న కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు.
అయితే, తారక్ రత్నది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. నెగిటివ్ యాంగిల్ ఉన్నా.. పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. పైగా తారక్ రత్న లుక్ కూడా చాలా వైలెంట్ గా ఉంటుందట. ఇగోతో రెచ్చిపోయే ఒక యువ రాజకీయ నాయకుడి పాత్రలో తారక్ రత్న నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం శ్రుతి హాసన్ లావు పెరగడానికి కసరత్తులు చేస్తోంది.
అన్నట్టు ఈ సినిమా కథ రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుంది. పైగా ఈ సినిమాలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారు. అలాగే ఈ కథలో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్, మరియు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా హైలైట్ గా ఉండబోతున్నాయి.