Pawan Kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం అల్లకల్లోలంగా తయారైంది. హీరోలందరూ భారీ రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ వాళ్ల సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ యాజమానులు థియేటర్లను మూసి వేస్తున్నాం అంటూ ఒక న్యూస్ ని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ కి స్పందించిన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల పైన ధ్వజమెత్తారు. ఇక దానికి వివరణ ఇవ్వడానికి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు (Dil Raju)ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మీద కోప్పడాన్ని ఆయన చాలా పాజిటివ్ గా తీసుకున్నట్టుగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కోప్పాడితే కోపడనివ్వండి…ఇండస్ట్రీకి పెద్దగా ఉంటూ తన అండదండలు అందిస్తూ ఇండస్ట్రీ ఎప్పుడు బాగు కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్…ఆయనకి కోపం వచ్చినప్పుడు తిట్టడంలో తప్పేమీ లేదు. గత 22 సంవత్సరాల నుంచి ఆయనను చూస్తున్నాను. మంచి ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడు.
ఆయన కోపానికి రావడానికి గల సిచువేషన్ అక్కడ క్రియేట్ అయింది నిజానికి జూన్ ఒకటోవ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాల వల్లే అది నెగిటివ్ గా పవన్ కళ్యాణ్ గారికి చేరింది. దాని వల్ల ఆయన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మీద ఫైర్ అయ్యారు అందులో తప్పేముంది అంటూ ఆయన స్పందించారు. మొత్తానికైతే దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోపాన్ని సమర్థిస్తూ అతనికి మద్దతుగా మాట్లాడడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే: పవన్ కళ్యాణ్
నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకేం చేయాలి. ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించాలి అనే విషయాల మీద పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతూ ఉంటాడు.
అలాంటి ఒక మంచి వ్యక్తికి కోపం వచ్చింది అంటే కచ్చితంగా ఇండస్ట్రీలో అవకతవకలు ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలో థియేటర్ల కొరత అనేది ఏర్పడడానికి కారణం ఏంటంటే… ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది బడా ప్రొడ్యూసర్లు ఒక మాఫియాలా ఏర్పడి చిన్న సినిమాలను బతకనివ్వడం లేదనేది గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వాదన దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం దానికి దిల్ రాజు వివరణ ఇవ్వడం అనేది అందరినీ ఆకర్షిస్తుంది…
పవన్ కళ్యాణ్‌కు కోపమొస్తే తిడుతారు.. పడతాం
పవన్ కళ్యాణ్ హర్ట్ అయితే మమ్మల్ని తిట్టే అధికారం ఉంది
– నిర్మాత దిల్ రాజు pic.twitter.com/juMpcQuBwZ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 26, 2025