Pawan Kalyan and Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి గొప్ప గుర్తింపైతే ఉంది. గబ్బర్ సింగ్ సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేసిన తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తన తోటి దర్శకులందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవుతున్నాడు… ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే పెద్ద సక్సెస్ ని సాధించాలని తను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమాతో మన భారీ సక్సెస్ ను సాధించాలని హరీష్ శంకర్ కి చెప్పారట.
ఈ సినిమా సక్సెస్ కోసం నువ్వు ఏం చేస్తావో తెలియదు మొత్తానికైతే నా అభిమానులకు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాలని చెప్పడంతో హరీష్ శంకర్ కి ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్ గా మారిందట. ఈ సినిమా ఓవరాల్ గా బాగా వచ్చినప్పటికి పవన్ కళ్యాణ్ మేనియా మరోసారి క్రియేట్ అవుతుందా లేదా అనే డైలమా లో కూడా ఉన్నాడట.
నిజానికి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కథ సన్నివేశాలేమీ పని చేయవు. ఆయన ఒక్కసారి వాకింగ్ చేసుకుంటూ వచ్చినా కూడా ఆ సీన్ ప్రేక్షకుడికి నచ్చుతోంది. అలాగే సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవుతోంది. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలే ఎక్కువగా రాశారట. కానీ అవి మరి ఓవర్ గా అవుతాయా ఫ్యాన్స్ రిసీవ్ చేసుకునే విధంగానే ఉంటాయా లేదా అనే ఒక డైలమాలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఫ్యాన్స్ కైతే పర్లేదు కానీ సగటు ప్రేక్షకులు వాటిని కొంచెం అతిగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తను తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నాడట. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా సరే ఆదరించడానికి అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తికి ఎదురుచూస్తున్నారు. కాబట్టి తన నుంచి సినిమా వస్తే చాలు చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…