Homeఎంటర్టైన్మెంట్Naveen Polishetty: అక్షరాలా 5500 కోట్ల గ్రాస్.. సంచలనం రేపుతున్న నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ వీడియో..

Naveen Polishetty: అక్షరాలా 5500 కోట్ల గ్రాస్.. సంచలనం రేపుతున్న నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ వీడియో..

Naveen Polishetty: యంగ్ హీరోల్లో కామిక్ టైమింగ్ అంటే మన అందరికీ గుర్తొచ్చే ఒకరిద్దరు హీరోల్లో ఒకరు నవీన్ పోలిశెట్టి. ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ పీక్ రేంజ్ లో ఉన్నింది. ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘అనగనగ ఒక రాజు’ వంటి చిత్రాల్లో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. సినిమాల్లో ఎంత ఫన్నీ గా కనిపిస్తుంటారో , బయట కూడా అదే రేంజ్ ఫన్నీ గా కనిపిస్తుంటాడు నవీన్ పోలిశెట్టి. ఈయన ఇంటర్వ్యూస్ ని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అంతే కాదు, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా క్రియేటివ్ గా ప్రెజెంట్ చేసి అందిస్తుంటారు నవీన్ పోలిశెట్టి. కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో ని విడుదల చేశారు.

ఈ వీడియో లో ముందుగా ఆయన మాట్లాడుతూ ‘నా లైఫ్ లో కాస్ట్లీస్ట్ ఫ్రేమ్ ని మీ ముందు ఉంచబోతున్నాను’ అంటూ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ అందరినీ పరిచయం చేసాడు. ముందుగా లోకేష్ కనకరాజ్ ని చూపిస్తూ 500 కోట్లు అని , ఆ తర్వాత రిషబ్ శెట్టి ని చూపిస్తూ 700 కోట్లు అని , ఆ తర్వాత పుష్ప నిర్మాత నవీన్ , సుకుమార్ లను చూపిస్తూ 2000 వేల కోట్లు అని, ప్రశాంత్ నీల్ ని చూపిస్తూ 1400 కోట్లు అని, నా సినిమా తో కలిపి మొత్తం 5500 కోట్ల ఫ్రేమ్ ఇది అంటూ చాలా ఇన్నోవేటివ్ గా చూపించారు నవీన్ పోలిశెట్టి. ఈ వీడియో లో పాపం హరీష్ శంకర్ కూడా ఉన్నాడు , ఆయన్ని పట్టించుకోలేదు అనుకోండి అది వేరే విషయం.

వీళ్లందరినీ చూపించిన తర్వాత చాలా తెలివిగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు నవీన్ పోలిశెట్టి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ దున్నేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. నవీన్ పోలిశెట్టి తన అభిమానులను ఎప్పటికీ నిరాశ పర్చరు , ఇలాంటి సరికొత్త ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నవీన్ పోలిశెట్టి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ , కానీ ఒక కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియా ని దున్నేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version