https://oktelugu.com/

Pawan Kalyan: త్వరలోనే పట్టాలెక్కనున్న శేఖర్ కమ్ముల – పవన్ కళ్యాణ్ మూవీ …

Pawan Kalyan: శేఖర్ కమ్ముల … ఆనంద్ , గోదావరి, హ్యాప్పి డేస్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ , లీడర్ , ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన దర్శకుడు. ఇటీవల సెప్టెంబర్ 24 న విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్టందుకున్న తరుణంలో శేఖర్ కమ్ముల ఫుల్ జోష్ లో ఉన్నారని తెలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా కథ, పాటలు, డైలాగ్స్ అన్నీ ఆడియన్స్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 17, 2021 / 11:03 AM IST
    Follow us on

    Pawan Kalyan: శేఖర్ కమ్ముల … ఆనంద్ , గోదావరి, హ్యాప్పి డేస్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ , లీడర్ , ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన దర్శకుడు. ఇటీవల సెప్టెంబర్ 24 న విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్టందుకున్న తరుణంలో శేఖర్ కమ్ముల ఫుల్ జోష్ లో ఉన్నారని తెలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా కథ, పాటలు, డైలాగ్స్ అన్నీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అయితే శేఖర్ కమ్ముల తర్వాత చిత్రంపై ఇండస్ట్రి లో హాట్ టాపిక్ నడుస్తుంది. దగ్గుపాటి రానా హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఈసారి ఈ సీక్వెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నారనే వార్త మీడియా లో హల్ చల్ చేస్తుంది.

    పవన్ కళ్యాణ్ ఇప్పటీకే రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ మేరకు ఇలాంటి సమయంలో ఈ సినిమాకు మరింత మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. పైగా రానున్న ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్ చేసుకుంటే పొలిటికల్ గా కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట. ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులతో పాటు… సినీ ఇండస్ట్రి వర్గాలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.

    ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే… ఇప్పటికే భీమ్లానాయక్ , హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక మూవీ కి కమిట్ అయ్యారు. ఈ చిత్రాలు పూర్తి అయిన తర్వాతే శేఖర్ కమ్ములతో సినిమా ఉండొచ్చు అని తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ తర్వాత తమిళ హీరో ధనుష్‌ తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నారు.