Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: జనరల్ బాడీ సమావేశంలో జనసేన పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్..కోపంతో మధ్యలోనే...

Pawan Kalyan: జనరల్ బాడీ సమావేశంలో జనసేన పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్..కోపంతో మధ్యలోనే వాకౌట్!

Pawan Kalyan: గత వారం రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఇచ్చిన చివరి చార్జిషీట్ పై సోషల్ మీడియా లో, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో ఏ స్థాయిలో చర్చలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సిట్ లడ్డు వ్యవహారం లో కల్తీ జరిగిన విషయం వాస్తవమే అని, ఒక్క శాతం పాలు కూడా లేకుండా, కేవలం కెమికల్స్ తో చేసిన లడ్డూలను 2019 నుండి 2024 వరకు సుమారుగా 20 క్తోల మంది భక్తులకు ఇచ్చారని, 250 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని సుదీర్ఘ నివేదిక ఇచ్చింది. అదే సిట్ రిపోర్టు లో NFDB ఇచ్చిన రిపోర్టు ని పేర్కొంటూ జంతువుల కొవ్వు కూడా కలిసింది అనే విషయాన్నీ ప్రస్తావిస్తూనే, మేము చేసిన టెస్ట్ లో 10 శాతం కంటే తక్కువ జంతువుల కొవ్వు ఉంటే డిటెక్ట్ చేయలేమని, పూర్తిగా జంతువుల కొవ్వు లేదని నిర్ధారించలేము కానీ, చాలా తక్కువ శాతం ఉండొచ్చని నివేదిక పేర్కొంది.

దీనిని పట్టుకొని వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అసలు జంతువుల కొవ్వే కలవలేదని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తూ దుష్ప్రచారాలు చేసి రాజకీయాల కోసం వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున తమ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. కల్తీ దారుణంగా జరిగింది అనే విషయాన్నీ పూర్తిగా పక్కన పెట్టి, కేవలం జంతువుల కొవ్వు లేదని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పిన మాటలను మాత్రమే హైలైట్ చేసి జనాల మైండ్ ని దివెర్త్ చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అసలు జరిగిన వాస్తవాలు ఏంటో వివరించే ప్రయత్నం చేశారు.

టీడీపీ నాయకులూ కూడా అసలు వాస్తవాలను జనాలకు మీడియా ద్వారా తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు కూడా వేశారు. ఆ సంగతి పక్కన పెడితే నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో ఆయన జనసేన పార్టీ నాయకులపై మండిపడినట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుపతి లడ్డు వ్యవహారం లో అలాంటి దుష్ప్రచారాలు చేస్తుంటే మీరంతా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అని నిలదీసాడు. అన్ని విషయాలపై నేనే స్పందిస్తే, మీరు ఉన్నది ఎందుకు అసలు పార్టీ లో అంటూ కోపడ్డాడని సమాచారం. ఆ తర్వాత ఆయన అసంతృప్తి చెందుతూ మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయాడట. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ తో మీటింగ్ పూర్తి అయ్యాక నన్ను పర్సనల్ గా కలవమని చెప్పాడట. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular