spot_img
Homeఎంటర్టైన్మెంట్Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ , డైరెక్టర్ గా సక్సెస్ అయ్యి , తన అభిమాన హీరోతో ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసినందుకు పవన్ ఫ్యాన్స్ డైరెక్టర్ సుజిత్ ని గుండెల్లో పెట్టేసుకున్నారు. కానీ ఒక సెక్షన్ పవన్ అభిమానులు మాత్రం ‘ఓజీ’ పై ఇప్పటికీ అసంతృప్తి తోనే ఉన్నారు. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్ లో డైరెక్టర్ సుజిత్ చూపించిన అనేక సన్నివేశాలు ‘ఓజీ’ చిత్రం లో కనిపించవు. ముఖ్యంగా ఈ సినిమాపై భారీ హైప్ ని పెంచినటువంటి ‘ఫైర్ స్ట్రోమ్ ‘ పాటని సినిమాలో అసలు వాడుకోలేదు. అంత గొప్ప పాటని సినిమాలో వాడుకోనందుకు ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అదే విధంగా ఈ చిత్రం లోని చాలా సన్నివేశాలు అసంపూర్ణంగా ఉంటాయి. ఉదాహరణకు మధురై పోలీస్ స్టేషన్ సీన్ బ్యాక్ స్టోరీ , అదే విధంగా మహారాష్ట్ర సీఎం , సత్య దాదా మధ్య జరిగే సంభాషణ సమయం లో , ఓజీ ఎంట్రీ ఇచ్చి స్వీట్ వార్నింగ్ ఇస్తూ , ఆ సీఎం కి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసినప్పుడు కొన్ని షాట్స్ చూపిస్తారు గుర్తుందా?, దాని బ్యాక్ స్టోరీ ని కూడా ఈ సినిమాలో చూపించకుండా వదిలేశారు. అలాంటి సాలిడ్ సన్నివేశాలను చూపించకుండా, బలహీనమైన ఫ్లాష్ బ్యాక్ ని చూపించి , సినిమా ఫ్లో ని చెడగొట్టారని , అది సెకండ్ హాఫ్ ని బాగా దెబ్బ తీసిందని అంటున్నారు నెటిజెన్స్. ఇలా ఒకటి కాదు రెండు కాదు , ఓజీ విషయం లో సుజిత్ చాలా తప్పులే చేశారు. ప్రమోషనల్ కంటెంట్ లో చూపించేది ఒకటి , సినిమాలో చూపించేది ఒకటి , సుజిత్ ని అసలు నమ్మకూడదు అంటూ సోషల్ మీడియా లో ఒక సెక్షన్ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ 2’ కి సంబంధించిన యానిమేషన్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. ఈ యానిమేషన్ వీడియో లో ఎక్కడ లేనిపోని ఎలిమెంట్స్ ని ఇరికించి , సినిమా మీద భారీ హైప్ పెంచి , చివరికి సినిమాలో ఆ ఎలిమెంట్స్ లేకుండా సింపుల్ గా చిత్రాన్ని పూర్తి చేస్తాడో అనే భయం పవన్ ఫ్యాన్స్ లో ఉంది. మరి సుజిత్ ఈసారి ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper