Pawan Kalyan fan base: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం హైదరాబాద్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకపక్క సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటూ, మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ రెండు పనులు మహా సముద్రాలు వంటివి, మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి చేసే పనులు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎలా ఇంత సమర్థవతంగా మ్యానేజ్ చేయగలుగుతున్నాడు అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్న ఆయన్ని కలిసేందుకు కొంతమంది ప్రజలు వచ్చారు. తమ సమస్యలను ఆయన వద్ద విన్నవించుకున్నారు. ఆ సమయం లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఉండడం విశేషం.
Also Read: ‘కన్నప్ప’ ఫలితం పై మొదటిసారి స్పందించిన మోహన్ బాబు!
అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రతీ రోజు పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలను షూటింగ్ లొకేషన్ నుండే చూసుకుంటున్నాడట. రోజుకి ప్రభుత్వ అధికారులు ఆయన్ని వచ్చి కలిసి వెళ్తుండడం, ప్రజలతో మమేకమై చర్చలు చేయడం వంటివి చేస్తూనే ఉన్నాడట. అలాంటి సమయం లో తీసిన ఫోటోనే ఇది అని అంటున్నారు. ఆగష్టు నెలాఖరున వరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ని కేటాయించాడట. అప్పటి లోపు ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. నవంబర్ నెల లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు గ్లింప్స్ వీడియోలు విడుదలై సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఎంతో స్టైలిష్ లుక్స్ తో కనిపించాడు. శ్రీలీల తో ఆయన ఎదో మాట్లాడుతుండగా అభిమానులు ఎవరో దానిని షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఈమధ్య కాలం లో ఓజీ సినిమా లోనే పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్ ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లోని లుక్స్ ఓజీ కంటే అద్భుతంగా ఉన్నాయని, హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జీ తో చూపిస్తాడని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.