Sreeleela: ఏ ముహూర్తం లో శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ, కెరీర్ మొత్తం డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. ఆమె ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ యావరేజ్ రేంజ్ లో ఆడగా, ఆ తర్వాత విడుదలైన ‘ధమాకా’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురుకున్న ఆమె, మళ్లీ ‘భగవంత్ కేసరి’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ప్రతీ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వస్తోంది. తెలుగు లో ఆమె లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక్కడ అదృష్టం కలిసి రావడం లేదని తమిళం లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఈ సంక్రాంతి కానుకగా శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ చిత్రం విడుదలైంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘జన నాయగన్’ కి పోటీ గా వచ్చింది. ఆ సినిమా వాయిదా పడింది , బాక్స్ ఆఫీస్ వద్ద ‘పరాశక్తి’ కి పోటీ గా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉంది అనే టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ అయ్యిందంటే, శ్రీలీల సెంటిమెంట్ గట్టిగా పని చేస్తుందా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఇప్పుడు ఆమె తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల ట్రాక్ రికార్డు చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వణికిపోతున్నారు. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ మా సినిమా మీద కూడా పడుతుందా ఏంటి అని భయపడుతున్నారు. అయితే ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి ముందు శృతి హాసన్ పరిసితి కూడా ఇంతే అని, ఆ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యాక ఆమె సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారిపోయిందని, శ్రీలీల సెంటిమెంట్ పవన్ కి ఏ మాత్రం ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు.
మరోపక్క శ్రీలీల బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసింది. వీటి పరిస్థితి ఏంటో అని భయపడిపోతున్నారు బాలీవుడ్ ఆడియన్స్ కూడా. పాపం శ్రీలీల చూసేందుకు అందంగా ఉంటుంది, డ్యాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ పెద్దగా రాకపోయినా ఈమెని అభిమానించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. కనీసం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో అయినా ఆమె అదృష్టం మారుతుందో లేదో చూడాలి.