Chiranjeevi Srikanth Odela Movie Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో మరోసారి ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు బాబీ తో చేస్తున్న సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ రెండు సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. నిజానికి బాబీ సినిమా ఎలా ఉన్నా కూడా శ్రీకాంత్ ఓదెల సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలంటే చిరంజీవిని టాప్ లెవల్లో నిలుపాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక ప్యారడైజ్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నప్పటికి ఈ సినిమా మీద ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది తెలియాల్సి ఉంది.
ఇక మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తే చిరంజీవి సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే సినిమాలను తీయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఉన్నాడు. కాబట్టి ఇక మీదటను గొప్ప కాన్సెప్ట్లతో వచ్చే యంగ్ డైరెక్టర్లకి అవకాశం ఇస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని డిఫరెంట్ గా చూపించి ఆయనకొక ఐడెంటిటి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.
ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఎందుకంటే 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…