Bheemla Nayak Donations: ఈ రోజు రిలీజ్ అయినా భీమ్లానాయక్ సినిమాకు స్పెషల్ షోలు, అధిక ధరలు వసూలు చేయడానికి వీల్లేదని AP ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గుంటూరు(D) మాచర్లలో పవన్ ఫ్యాన్స్.. నాగార్జున కళామందిర్ థియేటర్ వద్ద ఒక హుండీని ఏర్పాటు చేశారు. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందించాలని నిర్ణయించారు.
పవన్ సినిమాకే ఆంక్షలు ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయినా ఏపీలో భీమ్లా నాయక్ చిత్ర ప్రదర్శనపై చాలా రకాల ఆంక్షలు ఉంటాయని ముందే ఊహించారు. గత జీవో ప్రకారమే టికెట్లు అమ్మితే థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోక తప్పదు. ఇక ఇలా కాదని వారికి పవన్ అభిమానులే బాసటా నిలుస్తున్నారు.
థియేటర్ ల దగ్గర అభిమానులు ఓ హుండీ పెట్టి, విరాళాలు సేకరిస్తూ వెళ్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బును థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకి అందజేస్తారట. అయితే, ఇక్కడే కొంతమంది మోసాలకు తెగ పడుతున్నట్లు తెలుస్తోంది. అభిమానం పేరుతో డబ్బులు వసూళ్లు చేసి.. వాటిని జేబుల్లో వేసుకుంటున్నారని తెలుస్తోంది.
అన్నట్టు భీమ్లానాయక్ సినిమా రిలీజ్‌పై విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘ ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. విడుదలైన రెండు ట్రయిలర్లు అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంటారని ఆశిస్తున్నా’ అని వెంకటేష్ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక సినిమాకు అయితే మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాలో మ్యాటర్ ఆశించిన స్థాయిలో లేదు అని నెటిజన్లు తేల్చి పడేశారు. మరి కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో చూడాలి.
Also Read: ఆ ప్రాంతంలో పవన్ ఫ్యాన్స్ గొడవ.. రానా ఫ్యాన్స్ ఆందోళన
Recommended Video: