Pawan Kalyan Fans: అందరు హీరోలకు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఇది ఆయన ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే విషయం. ఈ అభిమానం అప్పుడప్పుడు హద్దులు దాటేస్తుంది, విమర్శలకు దారితీస్తుంది. మన అభిమానం అనేది ఎదుటివాళ్ళకు ఇబ్బంది కలగనంత వరకు అది అందంగా ఉంటుంది. హద్దు దాటి ప్రవర్తిస్తే అభిమానించబడే వారికి కూడా అసహ్యం వేస్తుంది.

ఈ తరహా విమర్శలు పవన్ ఫ్యాన్స్ అనేకమార్లు ఎదుర్కొన్నారు. మెగా హీరోల సినిమా ఫంక్షన్స్ కి వచ్చే పర్టిక్యులర్ పవన్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, గెస్ట్.. మాట్లాడుతుంది ఎవరనేది వాళ్లకు అనవసరం. సదరు స్పీకర్ పవన్ పేరు పలకాలి. సందర్భం తో సంబంధం లేకుండా పవన్ గురించి గొప్పగా మాట్లాడాలి. అప్పటి వరకు వాళ్ళ గోల ఆగదు. ఎవరినీ మాట్లాడనివ్వరు.
ఈ పరిణామాలతో మెగా హీరోలు సైతం విసిగిపోయారు. గతంలో అల్లు అర్జున్ తన మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ సంస్కారం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.అలాగే ఓ సందర్భంలో నాగబాబు కూడా ఫైర్ అయ్యారు. చివరికి అన్నయ్య చిరంజీవి మాట్లాడుతుంటే కూడా పవర్ స్టార్ అంటూ గోల చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతెందుకు చివరికి పవన్ కళ్యాణ్ సైతం అభిమానుల గోల భరించిన లేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓ పొలిటికల్ మీటింగ్ లో పవన్ మాట్లాడుతుంటే.. చెప్పేది వినకుండా నినాదాలతో గోల మొదలుపెట్టారు. విసిగిపోయిన పవన్ మీకు సభా సంస్కారం లేదా? సభా మర్యాద తెలియదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా హీరో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు.
Also Read: ‘అన్స్టాపబుల్’ జోరుతో మరో సరికొత్త షోకు బాలయ్య శ్రీకారం
ఈ వేడుకలో పవన్ ఫ్యాన్స్ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు. పవన్ ఫ్యాన్స్ లో ఒక వర్గానికి అల్లు అర్జున్ అంటే నచ్చరు. ఇక బాలయ్య అంటే మెగా ఫ్యాన్స్ బద్ధశత్రువుగా ఉన్నారు. కాబట్టి ఈ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హల్చల్ చేయడం ఖాయం అని అందరూ భావించారు. అయితే అలా ఏమీ జరగలేదు. పవర్ స్టార్ నినాదాలు వినపడలేదు.
దీనితో పవన్ ఫ్యాన్స్ లో మార్పు వచ్చిందని, వాళ్ళకు సభా మర్యాదలు వంటబట్టాయన్న టాక్ వినిపిస్తుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో చూడాలి.
Also Read: ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి అండగా ఉండాలి- బాలయ్య