Harish Shankar- Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆయన తనను ఉద్దేశించి అభిమానులు చేసే కామెంట్స్ కి స్పందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ట్విటర్ వేదికగా సలహా ఇచ్చాడు. హరీష్ తీయబోయే పవన్ మూవీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు… రెండూ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వాటిలో హరీష్ శంకర్ చిత్రం ఒకటి. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. 2012లో హరీష్ దర్శకత్వంలో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. దబంగ్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది.

సిల్వర్ స్క్రీన్ పై పవన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే దర్శకుడిగా హరీష్ పేరు తెచ్చుకున్నారు. వారి కాంబినేషన్ లో మూవీ అనగానే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి . భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ అద్బుతమన్న అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వెల్లిబుచ్చారు. అయితే రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ప్రాజెక్ట్ డిలే అవుతుంది.
ఆలస్యమైనా ప్రాజెక్ట్ ఉంటుందని హరీష్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఎలా ఉండాలో తెలియజేస్తూ… ఒక అభిమాని ట్వీట్ చేశాడు. ‘సర్ మీరు పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. గబ్బర్ సింగ్ లాంటి రొటీన్ మసాలా ఎంటర్టైనర్ చేయకండి. లోకల్ సబ్జెక్టు తో ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ చేయండి. మంచి సినిమాటోగ్రఫీ, సంగీతం ఉండేలా చూడండి. కెజిఎఫ్ వంటి ఫాస్ట్ కట్స్ ఉండకూడదు. గాల్లో ఎగరేసే ఫైట్స్ కాకుండా సహజంగా ఉండాలి…’ అని ట్వీట్ చేశాడు.

సదరు పవన్ ఫ్యాన్ అభిప్రాయానికి, సలహాకు హరీష్ స్పందించారు. నిన్ను డిస్పాయింట్ చేస్తున్నందుకు క్షమించాలి. నీతో నేను ఏకీభవించను అని కామెంట్ చేశాడు. మీరు చెప్పినట్లు సినిమా తీయడం కుదరదు. మాస్ అంశాలు తన చిత్రంలో ఉంటాయని హరీష్ చెప్పకనే చెప్పాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని పవన్ అభిమాని రోటీన్ మాస్ మసాలా చిత్రం అనడం హరీష్ ని హర్ట్ చేసి ఉండవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ తో తన మూవీ ఉంటుందని మరోసారి హింట్ ఇచ్చాడు.
Sorry to disappoint you … as i dont agree with you !! https://t.co/t26tQHS1LJ
— Harish Shankar .S (@harish2you) November 26, 2022