Bigg Boss 6 Telugu- Raj: బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఈ వారం ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, ఇనయా, రోహిత్ నామినేషన్లో ఉన్నారు. కీర్తి, రేవంత్ నామినేషన్స్ లో లేరు. ఆ ఏడుగురు సభ్యులలో ఒకరు ఓట్ల ఆధారంగా ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటి వరకు ఓటింగ్ లో శ్రీసత్య, ఫైమా, రాజ్ లకు తక్కువ ఓట్లు వచ్చాయట. లీస్ట్ లో ఫైమా ఉన్నారట. అయితే ఫైమాకు ఎవిక్షన్ పాస్ ఉంది. ఒక వేళ ఎలిమినేట్ అయినా తనని తాను కాపాడుకుంటుంది.

కాబట్టి ఈ వారం బలికాబోతుంది రాజ్ అంటున్నారు. రాజ్ ఎలిమినేషన్ దాదాపు ఖాయమే అన్న మాట వినిపిస్తోంది. నిజానికి శ్రీసత్య ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. అయితే ఆమెకు ఫ్యామిలీ వీక్ బాగా కలిసొచ్చింది. నడవలేని అమ్మను వీల్ చైర్ లో తీసుకొని శ్రీసత్య ఫాదర్ వచ్చాడు. శ్రీసత్య తల్లి పరిస్థితి చూసి ఆడియన్స్ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే బిగ్ బాస్ షో ద్వారా వచ్చే డబ్బులతో అమ్మకు వైద్యం చేయించాలని శ్రీసత్య మరిన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు.
ఆ దెబ్బతో ఆమెకు ఓట్లు బాగా పడ్డాయట. శ్రీసత్య ఎలిమినేషన్ నుండి తప్పుకుంది. పోయిన వారం వరకు శ్రీసత్యపై ఫుల్ నెగిటివిటీ నడిచింది. ఆమెను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇతరులను వాడుకుంటుంది. పెద్ద మానిప్యులేటర్ అంటూ జనాలు తిట్టిపోశారు. అది మొత్తం ఫ్యామిలీ వీక్ తో ఎగిరిపోయినట్లు ఉంది. ఈ క్రమంలో శ్రీసత్య ఫైనల్ కి చేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్లో 9 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు.

మరోవైపు రేవంత్ ని టైటిల్ విన్నర్ గా ఫిక్స్ చేశారు అంటున్నారు. మొదటి నుండి హోస్ట్ నాగార్జున కూడా అతన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తున్నాడు. అతడి గేమ్ చాలా వైలెంట్ గా ఉన్న నేపథ్యంలో అప్పుడప్పుడు వార్నింగ్ ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చాడు. కానీ ఎప్పటికప్పుడు అగ్రెసివ్ గా ఆడాలి అంటూ రెచ్చగొడుతూ ఉండేవాడు. కాబట్టి ఫైనల్ కి ఎవరు వెళ్లినా… టైటిల్ రేవంత్ దే అంటున్నారు. హౌస్లో గీతూ ఉంటే మరి కథ వేరేలా ఉండేదేమో. ఇక ఆదిరెడ్డిని తీవ్ర స్థాయిలో తిట్టిన నాగార్జున నువ్వు టైటిల్ కి అర్హుడివి కాదన్న సందేశం ఆడియన్స్ లోకి పంపారు.