Pawan Kalyan Son Akira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాబోతున్న ఓజి మరొకెత్తుగా మారబోతోంది…ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్ లో కీలకమైన లీడర్ గా మారాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తొందర్లోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాడు అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు… ఓజీ తో సినిమాతో పాన్ ఇండియాలో పలు రికార్డ్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో భారీ ఇమేజ్ ని సంపాదించుకొని తన అభిమానులకు ఆనందాన్ని పంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలను రిలీజ్ చేసి ఇక సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక అలాంటి క్రమంలోనే తన కొడుకు అయిన అకిరా నందన్ నుసినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు అకిరానందన్ కి సంబంధించిన వార్తలు బయటికి వచ్చినప్పటికి ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తాడు అనే దాని మీద సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది…ఇక ప్రస్తుతం యాక్టింగ్ లో మెలకువలు నేర్చుకుంటున్న అక్కిరా నందన్ వీలైనంత తొందరగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు..వీడియో వైరల్!
పవన్ కళ్యాణ్ సైతం అకిరానందన్ ను హీరోగా మార్చి తను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటి వరకు అకిరా నందన్ పెద్దగా మీడియా ముందుకు వచ్చింది అయితే లేదు. అప్పుడప్పుడు కనిపించినప్పటికి ఆయన కనిపించిన ప్రతిసారి ఏదో ఒక న్యూస్ తో వైరల్ అవుతూ ఉంటాడు…
ఇక అకిరానందన్ సైతం పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఉన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా నందన్ కనిపించిన ప్రతిసారి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. మరి అకిరా నందన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ సుజిత్ కి అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఎందుకంటే ఓజి సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడనే ఉద్దేశ్యంతో అకిరా ను అతనికి అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ జనరేషన్ కి ఏం కావాలో సుజిత్ కి బాగా తెలుసనే ఉద్దేశంతోనే ఆయన్ని సుజిత్ చేతిలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది… తను అనుకున్నట్టుగానే అకిరా బాధ్యతను సుజిత్ కి అప్పజెప్తారా లేదంటే అఖిరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను వేరే దర్శకుడికి అప్పజెప్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…