Manchu Vishnu Micro Films: మాట్లాడే మాటలు కొన్ని అతిశయోక్తి గా అనిపించినా మంచు విష్ణు(Manchu Vishnu) లో నిరంతరం ఎదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. తనకు టాలీవుడ్ లో అసలు మార్కెట్ లేదు అనే విషయం విష్ణు కి తెలుసు. అయినప్పటికీ కూడా 200 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి ‘కన్నప్ప’ అనే చిత్రం తెరకెక్కించాడు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలకైనా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఒక మంచి భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించాడు అనే మంచి పేరు ని మాత్రం తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే మంచు విష్ణు ఇప్పటి వరకు ఏ నిర్మాత కూడా చెయ్యని సరికొత్త ప్రయోగం చేసేందుకు శ్రీకారం చుట్టాడు.
Also Read: కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు..వీడియో వైరల్!
ఇక నుండి ఆయన మైక్రో సినిమాలను తెరకెక్కిస్తాడట. మొబైల్ ఫోన్ లోనే సినిమాటిక్ అనుభూతి కలిగించే బుల్లి చిత్రాలను ఆయన నిర్మిస్తాడట. అందుకోసం ఆయన వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని కూడా కేటాయించాడట. ఒక కథ ని కేవలం 8 నిమిషాల్లో మాత్రమే చెప్పగలిగేలా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. టాలెంట్ ఉన్న ఎవ్వరైనా సరే మంచు విష్ణు ని సంప్రదించి మైక్రో మూవీస్ ని చెయ్యడానికి సహాయపడాలని కోరుకుంటున్నాడు. ఈమధ్య కాలం లో ఆడియో బుక్స్ ఆన్లైన్ లో బాగా అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఈ కాన్సెప్ట్ నుండే ఈ ఐడియా ని అలోచించి ఉంటాడని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన షార్ట్ ఫిలిమ్స్ ని తియ్యాలని అనుకుంటున్నాడు. మరి ఈ ప్రయత్నం లో మంచు విష్ణు సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి. యూట్యూబ్ లో ఈమధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ కి అద్భుతమైన వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ తో పాటు డబ్బులు కూడా భారీగానే వస్తున్నాయి
ఇకపోతే మంచు విష్ణు కన్నప్ప ని మించిన సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడట. చాలా కాలం నుండి ఆయన రామాయణం తెరకెక్కించాలి అనేది ఆశ అట. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది, గతం లో సూర్య ని రాముడిగా, రావణుడిగా మోహన్ బాబు ని పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాడట. కానీ అప్పటి మార్కెట్ కి బడ్జెట్ సహకరించకపోవడంతో ఈ ప్రొజెక్ట్ అట్టకెక్కింది. కానీ ఇప్పుడు మాత్రం భారీ హంగులతో మంచి డైరెక్టర్ తో, క్యాస్టింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని మంచు విష్ణు ప్రయత్నం చేస్తున్నాడట. మరి ఈ ప్రయత్నం లో ఆయన ఎంత వరకు సక్సెస్ సాధిస్తాడా చూడాలి.