Pawan Kalyan- Chiranjeevi: పవన్ కళ్యాణ్ ని పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. దానికి కారణం ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఆయనది. చాలా నిరాడంబర జీవితం ఇష్టపడతారు. చిన్న పెద్ద తారతమ్యాలు ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు. మూవీ సెట్స్ లో పవన్ బిహేవియర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అవసరమైనంత వరకే మాట్లాడే పవన్… ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ అందులో మునిగిపోతారట. దర్శకులు, నిర్మాతలు, తోటి నటులు పవన్ ని అభిమానించడానికి, ప్రేమించడానికి ఆయన ప్రవర్తనే కారణం. అనవసరంగా ఎవరినీ నొప్పించ కూడదు. వీలైతే ఒకరికి సహాయం చేయాలి కానీ… నాశనం చేయకూడదని ఆయన గట్టిగా నమ్ముతారు.

పవన్ కళ్యాణ్ సాదా సీదాగా ఉంటారని మనందరికీ తెలుసు. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లకు ఆయన వాస్తవంగా అలానే ఉంటారని తెలుసు. తాజాగా పవన్ నిరాడంబర, నిస్వార్ధ జీవనాన్ని అన్నయ్య చిరంజీవి కొనియాడారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కి సొంత ఇల్లు కూడా లేదన్న పచ్చి నిజం బయటపెట్టారు. చిరంజీవి మాట్లాడుతూ… పవన్ నాకు బిడ్డతో సమానం. తనను నేను ఎత్తుకొని పెంచాను. సురేఖను తల్లిలా ప్రేమిస్తాడు. మేమిద్దరం అంటే పవన్ కి అమితమైన అభిమానం.
పవన్ కి ఆవగింజంత స్వార్థం కూడా ఉండదు. డబ్బు సంపాదించాలి కూడబెట్టాలనే యావ ఉండదు. పదవీ కాంక్ష అంతకన్నా లేదు. పవన్ తన కోసం ఎన్నడూ ఆలోచించుకోరు. వేళకు అన్నం తినడు. మంచి బట్టలు వేసుకోడు. ఒక దశలో పవన్ కి సొంత ఇల్లు కూడా లేదు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉంటుంది.

మురికి కూపం లాంటి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ ఉన్న చెత్తంతా శుభ్రం చేయాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి కూడా కొంత మురికి అంటుంది, అని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పరోక్షంగా జనసేనకు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. ఉన్నత భావాలు కలిగిన పవన్ కి ప్రజలు ఏదో ఒకరోజు అత్యున్నత పదవి కట్టబెడతారని గతంలో చెప్పారు.