Khushi Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..ఈరోజు ఈ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది..సిటీ లో ఉన్న ప్రతీ థియేటర్ లో ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది.

ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ , ఖుషి సినిమాకి జరిగినంత హంగామా, వచ్చిన ఓపెనింగ్స్ ఇదివరకు ఏ స్టార్ హీరో కి కూడా జరగలేదనే చెప్పాలి..వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రజలకు ఎంత అభిమానమో ఈ సినిమా ద్వారా అర్థం అయ్యింది..ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..గతం లో ‘జల్సా’ స్పెషల్ షోస్ ఈ ప్రాంతం లో కోటి 23 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యినప్పటికీ ఏ సినిమాకి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు..మళ్ళీ పవన్ కళ్యాణే తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు..భవిష్యత్తులో ఈ రికార్డు ని ఎవ్వరు ముట్టుకోలేరు కూడా..ఇక సీడెడ్ లో అయితే ఈ చిత్రం చరిత్ర తిరగరాసింది.

విడుదలైన ప్రతీ చోట కాసుల కనకవర్షం కురిపించిన ఈ చిత్రానికి మొదటి రోజు అక్కడ 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో 40 లక్షలు , ఈస్ట్ గోదావరి జిల్లాలో 20 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 లక్షలు, గుంటూరు సిటీ 45 లక్షలు..అలా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ట్రేడ్ పండితులు చెప్తున్నారు.