Ghaati Pawan Kalyan: ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) తెరకెక్కించిన ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం అనేక వాయిదాల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది బాగుందని అంటున్నారు, మరికొంత మంది ఇలాంటి సినిమాలు ఆడవు అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి క్రిష్ తన సేఫ్ జోన్ ని వదిలి కాస్త ఈ చిత్రం తో కొత్తగా ప్రయత్నం చేసినట్టు గా అనిపించింది. అనుష్క ని ఆయన వివిధ కోణాల్లో చూపించాడు. ఆమె క్యారక్టర్ ఆర్క్ ని చూస్తుంటే ‘ఒసేయ్ రాములమ్మా’ లో విజయ శాంతి క్యారక్టర్ ఆర్క్ గుర్తుకొచ్చింది. ఇలాంటి సినిమాలు ఏ హీరోయిన్ చేసినా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విజయ శాంతినే.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత మనకి అర్థమైన స్టోరీ ఏమిటంటే, వంశ పారంపరంగా గంజాయి సాగు చేసుకుంటూ బ్రతికే హీరో హీరోయిన్లు, కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఇక మీదట గంజాయి సాగు చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకుంటారు. ఆ క్రమం లో వీళ్లకు అక్కడ ఉన్న ఉన్నవాళ్లు ఎదురు తిరుగుతారు, కొంతమంది మద్దతు కూడా తెలుపుతారు. ఈ క్రమం లో జరిగే సంఘర్షణే ఈ సినిమా అనేది తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే నిజ జీవితం లో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగు మీద యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గంజాయి సాగు జరుగుతున్న ప్రదేశాల్లోకి వెళ్లి, గంజాయి సాగు చెయ్యకూడదు అని, దాని గురించి అక్కడి ప్రజలకు అవగాహనా కల్పిస్తూ, వాళ్లకు ప్రత్యామ్నాయం గా మరో వ్యాపకం చూపిస్తాను అని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సమయం లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈరోజు విడుదలైన ‘ఘాటీ’ మూవీ ట్రైలర్ ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ మాటలే గుర్తుకు వచ్చాయంటూ సోషల్ మీడియా లో పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఘాటీ చిత్రం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకముందు, అనగా ఆయన ప్రతిపక్షం లో ఉన్నప్పుడే మొదలైంది. కాబట్టి డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రసంగాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించలేదు, యాదృచ్చికంగా అలా రెండు మ్యాచ్ అయ్యాయి అని చెప్పొచ్చు. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ మధ్యలోనే వదిలేసి బయటకి వచ్చి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాతోనే ఆయన తన ప్రతిభ ని నిరూపించుకోవాలి. సక్సెస్ అయితే క్రిష్ మరో లెవెల్ కి వెళ్లొచ్చు.