https://oktelugu.com/

Viral Video: రేణు దేశాయ్ తన కూతురు ఆధ్యతో కలిసి డ్యాన్స్ ఇలా చేసిందేంటి..? వీడియో వైరల్…

ఆధ్య ను చూసినా అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు. ఇక ఆధ్య, అకిరా నందన్ ఇద్దరు కూడా ఏది చేసినా చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

Written By: , Updated On : April 29, 2024 / 12:59 PM IST
Aadhya and Renu Desai Dance Video Goes Viral

Aadhya and Renu Desai Dance Video Goes Viral

Follow us on

Viral Video: పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలేమి చేయకపోయినా కూడా ఆమె సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంభందించిన ప్రతి వీడియోలు గానీ, ఫోటోలు గానీ అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తు ఉంటుంది. ఇక అవి ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఇదిలా ఉంటే ఆమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక మొత్తానికైతే ఇప్పుడు ఒక డాన్స్ వీడియో ని షేర్ చేసింది. ఇక ఆ వీడియో చూసిన అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రేణు దేశాయ్ డాన్స్ చేస్తూ “నేను నా డాన్సింగ్ పార్ట్నర్ తో డాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అలాగే “మనకు ఇష్టమైన వారితో డ్యాన్స్ చేస్తే అది ఒక థెరపీలా పనిచేస్తుంది” అంటూ రాస్కొచ్చింది. ఇక ఈ వీడియోలో ఆద్య డాన్స్ చాలా బాగా చేసింది. అయితే మొదట్లో ఆమె డాన్స్ చేసినప్పుడు ఆమె ఫేస్ ను రివిల్ చేయకుండా దాచి ఉంచి చివర్లో తన ఫేస్ ను రివిల్ చేెశారు.

ఇక మొత్తానికైతే ఆధ్య ను చూసినా అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు. ఇక ఆధ్య, అకిరా నందన్ ఇద్దరు కూడా ఏది చేసినా చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే వాళ్ళు చేసిన వీడియోలు గాని, ఫోటోలు గాని అన్ని చాలా తొందరగా వైరల్ అవుతూ ఉండడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలకు సంబంధించిన కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే అకీరానందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…