Game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వారు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ సైతం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి ముగ్గురు స్టార్ హీరోలు ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెబుతూ వస్తున్నారు. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల ఇలాంటి సభలు నిర్వహించిన లేదంటే స్టార్ హీరోలు బయటికి వచ్చిన కూడా కొన్ని ఆంక్షలు అయితే విధిస్తున్నారు.
మరి దానికి తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వస్తున్నాడు. ఇక అతన్ని చూడడానికి అతని మాటలు వినడానికి చాలామంది జనం ఎగబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్లందరిని దాటుకొని పవన్ కళ్యాణ్ లోపలికి రావాలి అంటే సెక్యూరిటీ పరంగా అయిన, జనాలు పవన్ కళ్యాణ్ వీక్షించడానికైనా వాళ్లకు ఎక్కువ స్పేస్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ అవన్నీ పకడ్బందీగా ఉంటేనే తను ఈవెంట్ కు వస్తానని చెప్పాడు. దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్స్ ఇప్పించడంతో గేమ్ చేంజర్ సినిమా టీం ప్రస్తుతం కేర్ ఫుల్ గా ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఈ నాయకుడు..
గేమ్ చేంజర్ ఈవెంట్ కి రావడం వల్ల సినిమా క్రేజ్ అనేది తారా స్థాయికి పెరిగిపోతుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…