Nani : నాని మిస్ చేసుకున్న రెండు సినిమాలు ఆ ఇద్దరు హీరోలను స్టార్లను చేసిందా..?
ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Nani : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే స్టార్ హీరోలందరు తమను తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమం లో కొంతమంది యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియాలో సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు నాని… ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాగే తన నటనతో యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని ఆకట్టుకునే సత్తా ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి నటుడు ఇప్పుడు మంచి సినిమాలను చేస్తున్నాడు. వరుసగా మూడు విజయాలు అందుకొని ఆయన యావత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇక అందులో భాగంగానే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న పారడైజ్ సినిమాని కూడా సూపర్ సక్సెస్ గా మలిచే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా శైలేష్ కొలన్ దర్శకత్వంలో హిట్ 3 మూవీని చేస్తున్నాడు… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలను చేసినప్పటికి నాని వదిలేసిన రెండు సినిమాల వల్ల ఇద్దరు స్టార్ హీరోలుగా మారారనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి నాని మంచి సినిమాలు చేస్తున్నాడు. అలాగే అనుకోకుండా కొన్ని మంచి కథలను కూడా రిజెక్ట్ చేస్తున్నాడు…
వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు వరుసగా రెండు స్టోరీలను నానికి వినిపించారట. అవి ఒకటి ‘సార్ ‘ కాగా, మరొకటి ‘లక్కీ భాస్కర్’… ఇక ఈ రెండు కథలను విన్న నాని రెండింటికి నో చెప్పడం విశేషం…మరి ఈ రెండు సినిమాలని పరభాష హీరోలతో చేసి వెంకీ అట్లూరి మంచి విజయాన్ని అందుకోగా సార్ సినిమాతో ధనుష్ లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఇద్దరు మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు…
ఇక ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో వెంకీ కూడా స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుత ఆయన మరోసారి ధనుష్ తోనే సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన తెలుగు హీరోల వైపు పెద్దగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.
కాబట్టి పరభాష హీరోలైతే తనకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారనే ఉద్దేశ్యంతో ఆయన వాళ్లను తీసుకొని సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం… ఎందుకంటే వైవిధ్యమైన కథాంశాలను తీసుకొచ్చి మంచి విజయాలుగా మలుస్తున్నాడు మరి ఇలాంటి సందర్భంలో మన తెలుగు హీరోలు అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…