https://oktelugu.com/

సుప్రీం హీరో మూవీకి పవర్ స్టార్ క్లాప్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ గురువారం ప్రారంభమైంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయాధరమ్ తేజ్ పై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభంచారు. దర్శకుడు దేవకట్టా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీని దేవకట్టా తెరకెక్కిందును ప్లాన్ చేస్తున్నాడు. సాయితేజ్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుంది. దేవకట్టా తెలుగోల ‘ప్రస్థానం’ మూవీతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీని హిందీలోనూ […]

Written By: , Updated On : March 12, 2020 / 04:44 PM IST
Follow us on

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ గురువారం ప్రారంభమైంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయాధరమ్ తేజ్ పై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభంచారు. దర్శకుడు దేవకట్టా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీని దేవకట్టా తెరకెక్కిందును ప్లాన్ చేస్తున్నాడు. సాయితేజ్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుంది.

దేవకట్టా తెలుగోల ‘ప్రస్థానం’ మూవీతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీని హిందీలోనూ రీమేక్ చేసి హిట్టుందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో సాయిధరమ్ తేజ్ హీరోగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా నేటి పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.