BRO Teaser: సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు అంటూ అదిరిపోయే రేంజ్ డైలాగ్స్ తో నిండిపోయిన బ్రో టీజర్..ఫ్యాన్స్ కి పండగే

అయితే అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మరింత ఆలస్యం చేసారు, ముందుగా 5 గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తామని అన్నారు కానీ, చివరి నిమిషం లో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడం వల్ల బాగా ఆలస్యం అయ్యింది. దీనికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది, టీజర్ విడుదల చేస్తున్నదే ఆలస్యం చేస్తున్నారు, కనీసం చెప్పిన సమయానికి అయినా విడుదల చెయ్యరా అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విరుచుకుపడ్డారు.

Written By: Vicky, Updated On : June 29, 2023 6:57 pm

BRO Teaser

Follow us on

BRO Teaser: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ముందు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకి సంబంధించిన టీజర్ రావడం అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి ఇలా జరగడం, దీనిపై ఫ్యాన్స్ మేకర్స్ మీద చాలా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా లో ప్రతీ రోజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థని ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా చీమకుట్టినట్టు లాగా కూడా స్పందించలేదు.

అయితే అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మరింత ఆలస్యం చేసారు, ముందుగా 5 గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తామని అన్నారు కానీ, చివరి నిమిషం లో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడం వల్ల బాగా ఆలస్యం అయ్యింది. దీనికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది, టీజర్ విడుదల చేస్తున్నదే ఆలస్యం చేస్తున్నారు, కనీసం చెప్పిన సమయానికి అయినా విడుదల చెయ్యరా అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విరుచుకుపడ్డారు.

దీంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది, ఇంకోసారి మా హీరో తో సినిమా చేస్తే మీ ఆఫీస్ కి వచ్చి ధర్నా చేస్తాము అంటూ బెదిరించారు కూడా. అయితే ఇన్ని రోజులు అభిమానుల పడిన ఫ్రాస్ట్రక్షన్ మొత్తం ఈ 1:35 సెకండ్ల టీజర్ చూసిన తర్వాత చిల్ అయిపోయారు, ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు అంటూ తిట్టిన వాళ్ళే మేకర్స్ ని ట్యాగ్ చేసి పొగుడుతున్నారు.

ఇక ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి గమనిస్తే పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు చూడని రేంజ్ రోల్ లో సరికొత్తగా చూపించినట్టుగా అర్థం అవుతుంది. టీజర్ ప్రారంభం లోనే తమ్ముడు సినిమా గెటప్ లో కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చిన్నగా ఆయన స్టైలిష్ లుక్స్ ని చూపిస్తూ సాయి ధరమ్ తేజ్ తో ‘సినిమాలు ఎక్కువ చూస్తా ఏంట్రా నువ్వు’ అంటూ ఒక డైలాగ్ అంటాడు.దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా టీజర్ చూస్తున్నప్పుడు ఇది రీమేక్ లాగానే అసలు అనిపించలేదు, చాలా కొత్తగా అనిపించింది. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.