Bro Collections: బ్రో 5వ రోజు కలెక్షన్స్… మిరాకిల్ జరగాల్సిందే!

5వ రోజు బ్రో వసూళ్లు మరింతగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో రూ. 1.60 నుండి 1.70 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే బ్రో రూ. 2 కోట్ల షేర్ వసూలు చేసింది.

Written By: Shiva, Updated On : August 2, 2023 8:45 am

Bro Collections

Follow us on

Bro Collections: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది. రెండు రోజులుగా ఈ చిత్ర వసూళ్లు భారీగా పడిపోయాయి. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫాంటసీ డ్రామా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటింది. వీకెండ్ వరకు బ్రో మూవీ జోరు కొనసాగింది. వర్కింగ్ డేస్ నుండి నెమ్మదించింది. సోమవారం బ్రో చిత్ర వసూళ్లు డెభై శాతానికి పైగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు బ్రో కేవలం రూ. 2 కోట్ల షేర్ మాత్రమే సాధించింది.

5వ రోజు బ్రో వసూళ్లు మరింతగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో రూ. 1.60 నుండి 1.70 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే బ్రో రూ. 2 కోట్ల షేర్ వసూలు చేసింది. ఐదు రోజులకు గానూ బ్రో మూవీ రూ. 61 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్రో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం రూ. 30 కోట్లకు అమ్మారు. ఆంధ్రా రూ. 37.30 కోట్లకు వరకు రైట్స్ అమ్ముడుపోయాయి. సీడెడ్ రూ. 13.3 కోట్లకు అమ్మారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రో రూ. 80 నుండి 81 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే… రూ. 97 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రో వంద కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది.

బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో నలబై కోట్ల వరకు వసూలు చేయాలి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే కష్టం అనిపిస్తుంది. మిరకిల్ జరిగితే తప్ప బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. బ్రో వినోదాయసితం రీమేక్ గా తెరకెక్కింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.