Pawan Kalyan Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు తక్కువే అయినప్పటికి వాటితో కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…అప్పటి వరకు హీరో అంటే ఇలానే ఉండాలి అనే ఒక మూస ధోరణిలో వెళుతున్న సినిమా ఇండస్ట్రీలో తన స్టైల్ తో, తన స్వాగ్ తో, ఫైట్స్ తో ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి తనవైపు తిప్పుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి తన అభిమానులు కోరిక మేరకు అవకాశం ఉన్న ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన జనసేన పార్టీ పెట్టిన మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు…2019 ఎలక్షన్స్ లో కేవలం ఒక్క సైట్ రావడం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్లేస్ లలో ఓడిపోవడం…ఇవన్నీ ఆయనకు జరిగిన అవమానాలు…కానీ ఓడిపోయిన చోటే గెలుపు ఉంటుంది అని నమ్మి వెనక్కి తగ్గకుండా ఒంటరి పోరాటం చేసిన గొప్ప యోధుడు పవన్ కళ్యాణ్…మనం ఏ ఫీల్డ్ లో ఉన్న ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు….ఇక ప్రస్తుతం నాయకుడిగా విధులు కొనసాగిస్తూనే సినిమాలన్ కూడా చేస్తున్నాడు…
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు చాలామంది సినిమా రాజకీయ ప్రముఖులు సైతం బర్త్ డే విసెస్ తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ నెల 25వ తేదీన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన స్టామినా ఏంటో చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లతో రికార్డుల మోత మోగించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించినట్టయితే పవన్ కళ్యాణ్ టాప్ లెవల్లో ముందుకు తీసుకెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక తన బర్త్ డే సందర్భంగా ఈరోజు చాలామంది అభిమానులు రక్తదానాలను చేస్తు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు…
నిజానికి ఒక వ్యక్తి అనుకుంటే ఇంత మంది ఫ్యాన్స్ ని సంపాదించవచ్చా? తన వ్యక్తిత్వంతో తన అభిమానులుగా మార్చుకునే శక్తి ఒక వ్యక్తి ఉందా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ను చూస్తే మాత్రం ఇది నిజం అని నమ్మక తప్పదు…తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అవసరం ఉందని వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప మనసు ఉండటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి…