Pawan Kalyan Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు…ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి చాలా ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో తను అగ్రస్థానంలో నిలిచాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… హీరో అంటే తెరమీద నాలుగు మంచి మాటలు చెప్పి, విలన్స్ తో ఫైట్ చేసినంత మాత్రాన వాళ్లు హీరో అయిపోయారు. నిజమైన హీరో అంటే బయట సమాజానికి అంతో ఇంతో సేవ చేస్తూ, సమస్యల్లో ఉన్నవారిని గట్టెక్కించిన వాళ్లు మాత్రమే హీరోలవుతారు. దానికి నిలువెత్తు నిదర్శనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సేవా కార్యక్రమం వెనుక చాలామంది పేదలు లబ్ధి పొందారు. జనానికి ఏదైనా సహాయం చేయాలి అని నిశ్చయించుకొని నేను హీరోగా ఉంటే కేవలం కొంత మందికి మాత్రమే సేవ చేస్తాను. అదే రాజకీయ నాయకుడిని అయితే జనం అందరికీ మంచి చేయవచ్చు అనే ఒక సంకల్పంతో రాజకీయ అరంగ్రేటం చేశారు… ఇది పక్కన పెడితే కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ కి బయట నలుగురితో మాట్లాడాలంటే కూడా సిగ్గు గా ఉండేదని అందుకే ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడేవారు కాదని దాన్ని కొంతమంది పొగరు అనుకునేవారని గతంలో ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు…వాటన్నింటిని పక్కన పెట్టీ అందరితో మాట్లాడే విధానాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాడు. అందువల్లే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక తిరుగులేని శక్తిగా మారాడు. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిర్ణయించడంలో కూడా తను ఒక గేమ్ చేంజర్ గా మారాడు అంటే ఆయన ఇంపాక్ట్ దేశ రాజకీయాల్లో ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
ఇక సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని మోటివేట్ చేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఎన్నో అవమానాలను ఎన్నో ఇబ్బందులను ఎన్నో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొని, మరి ఒక్కడే పోరాటం చేసి అవతల పార్టీలను నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తి కూడా తనే కావడం విశేషం… ఒక వ్యక్తి తలుచుకుంటే ఒక వ్యవస్థను నిర్మించవచ్చు, ఒక వ్యక్తి అనుకుంటే ఒక సమూహాన్ని ఏర్పాటు చేయవచ్చు, ఒక వ్యక్తి కోరుకుంటే ఎంతటి కష్టమైన పనినైనా చేసి తీరవచ్చు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు…
తను పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. నువ్వు ఎలక్షన్స్ కి పనికిరావు, కనీసం నువ్వు ఊర్లో సర్పంచ్ గా కూడా గెలవలేవు అంటూ చాలామంది ఎంత హేళన చేసినా కూడా వాటన్నింటినీ పర్సనల్గా తీసుకోకుండా తను జనానికి ఏదో చేయాలని ఒక నిజాయితీతో ముందుకు సాగాడు.
అందువల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ కి ఎవరికీ లేనంత గుర్తింపు అయితే వచ్చింది. కష్టాన్ని నమ్ముకున్నోడు నలుగురికి సేవ చేయాలి అనుకున్న వాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ శాశ్వతంగా గెలుస్తాడు అని చెప్పడంలో పవన్ కళ్యాణ్ దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు… ఇక రాజకీయ పరంగా కూడా ఏపీలో చాలా మార్పులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర అయితే పోషిస్తున్నాడు. ఫ్యూచర్లో సీఎంగా ఎదిగి తన అభిమానుల కోర్కె తీర్చి, అలాగే జనాల సమస్యలకు ఒక సొల్యూషన్ చూపించాలని కోరుకుందాం…