Pawan Kalyan Birthday: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు ని ఎంత గ్రాండ్ గా నిర్వహిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన పుట్టిన రోజు అంటే అభిమానులకు ఒక పండగే. ఎటు చూసినా సేవా కార్యక్రమాలు, కటౌట్స్, బ్యానర్స్ కనిపిస్తాయి. ఇక కాలేజీ కుర్రాళ్ళు అయితే తమ కాలేజీలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఏ రేంజ్ లో జరుగుకుంటారో మనం సోషల్ మీడియా లో గత కొంతకాలం గా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది కూడా అలాగే జరగబోతుంది కానీ, ప్రతీ ఏడాది లాగా ఈసారి రీ రిలీజ్ చిత్రం మాత్రం ఉండదు. జల్సా సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కానీ, అభిమానుల ఒత్తిడి కారణంగా ఆగిపోయింది. ఎందుకంటే ఈ నెల 25న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది.
Also Read: స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్..’ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి రేపు బ్లాస్టింగ్ అప్డేట్!
అభిమానులు మొత్తం ఈ సినిమా మేనియా లో మునిగి తేలుతున్నారు. ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. ఓవర్సీస్ లో కొన్నిరోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ఏ ఇండియన్ సినిమాకు జరగనంత భారీ బుకింగ్స్ ఈ సినిమాకు జరుగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ 2న ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవుతుందని ఆశించారు ఫ్యాన్స్. కానీ అది దాదాపుగా సాధ్యం కాదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే ఆ టీజర్ కి సంబంధించిన పూర్తి వర్క్ ఇంకా జరుగుతూనే ఉందట. రేపు ఈ టీజర్ విడుదల అవుతుందా లేదా అనేది క్లారిటీ రానుంది. ఒకవేళ రాకపోతే మాత్రం అభిమానులు బాగా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. ఎందులకంటే ఇప్పుడు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ ఇంకా జెట్ స్పీడ్ లో వెళ్లాలంటే ఓజీ నుండి ఊపు రప్పించే టీజర్ రావాలి.
ప్రస్తుతానికి అయితే అది పుట్టినరోజు నాడు విడుదల అవ్వడం అనేది ప్రస్తుతానికి 50-50 అవకాశాలు ఉన్నాయట. టీజర్ ఉన్నా లేకపోయినా ఒక పోస్టర్ అయినా ఈ సినిమా నుండి వస్తుందట. అదే విధంగా ఒకవేళ టీజర్ విడుదల కాకపోతే పోస్టర్ ద్వారా టీజర్ విడుదల తేదీని సెప్టెంబర్ 2 ప్రకటిస్తారట. మరో పక్క పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) నుండి కూడా గ్లింప్స్ వీడియో చిన్నది ఒకటి రానుంది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని సినిమాకు సంబంధించిన కంటెంట్ వస్తుంది, మరో 25 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు చెందిన కంటెంట్ మాత్రం వస్తుందో రాదో అనే అనుమానం తో ఉంటున్నారు. ఇది ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.