Pawan Kalyan Gift For Balakrishna: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఏదైనా మాట ఇచ్చాడంటే కచ్చితంగా చేసి తీరుతాడు. మాట తీసుకున్న వాళ్ళు అయినా మర్చిపోతారేమో కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం మర్చిపోడు అని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. అనేక సందర్భాల్లో పొల్లు పోకుండా వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారని పవన్ కళ్యాణ్ చేసే పనుల ద్వారా నిరూపితం అవుతూ ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యం లో తలసేమియా చిన్నారుల కోసం సంగీత దర్శకుడు థమన్ ఆద్వర్యం లో యూఫోరియా మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన తలసేమియా చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) కి 50 లక్షల రూపాయిల విరాళంని ప్రకటించాడు.
నిన్న రాత్రి ఆయన 50 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ కి పంపినట్టు ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ హ్యాండిల్ ట్వీట్ వేసింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ‘ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తలసేమియా చిన్నారుల కోసం రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీపవన్ కళ్యాణ్ గారు, తన మాట ప్రకారం విరాళాన్ని చెక్క్ రూపంలో అందజేశారు’ అంటూ ఒక ట్వీట్ వెయ్యగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. టీడీపీ మరియు నందమూరి అభిమానులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్స్ వేశారు. అంతే కాకుండా సరిగ్గా బాలయ్య(Nandamuri Balakrishna) పుట్టినరోజు నాడు ఈ చెక్ చెల్లెలా పవన్ కళ్యాణ్ డేట్ వేయడం తో నందమూరి అభిమానులు ఇది బాలయ్య బాబు పుట్టినరోజు కి ఇచ్చిన బహుమతిగా భావించారు.
అంతే కాకుండా కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా బాలయ్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసాడు. ‘శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను. ఎలాంటి జానర్ లో అయినా అద్భుతమైన నటన కనబర్చే హీరో ఆయన. హిందూపురం శాసనసభ్యుడిగా ఆ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను అందించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గతంలో కూడా ఆయన బాలయ్య బాబు కి ఎన్నోసార్లు శుభాకాంక్షలు తెలియజేసాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం బాలయ్య కి శుభాకాంక్షలు తెలపకపోవడం అందరినీ ఆశ్చర్యనికి గురి చేస్తుంది. చిరంజీవి మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా ఎలాంటి శుభాకాంక్షలు తెలియచేయలేదు.