Pawan Kalyan Fish Venkat: ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) చాలా కాలం నుండి అనారోగ్యం తో బాధపడుతూ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఇటీవలే కన్నుమూసిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు ఆయన మరణాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎవ్వరూ సంతాపాన్ని కూడా వ్యక్తం చెయ్యలేదు. వెంటిలేటర్ పై ఆయన చికిత్స తీసుకుంటున్న సమయం లో, అతని భార్య, కూతురు సహాయం చెయ్యండి చేతులు చాచి అడిగినా కూడా సినీ ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ ఏడాది ప్రారంభం లో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకొని, ఆయన్ని తన ఆఫీస్ కి పిలిపించి రెండు లక్షల రూపాయిల చెక్ ని అందించాడు. అప్పట్లో ఫిష్ వెంకట్ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ వీడియో కూడా చేసాడు.
Also Read: డ్రైవర్ లేకుండా విదేశాల్లో కారులో అల్లు అర్జున్ సాహసం!
అయితే ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ డబ్బులను ఏమి చేసాడు?, తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించాడా లేదా అని అతని భార్య ని రీసెంట్ గా మీడియా రిపోర్టర్స్ అడిగితే, దానికి ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ మాత్రమే మాకు ఇండస్ట్రీ నుండి డబ్బులు ఇచ్చాడు. కానీ మా ఆయన ఆ డబ్బులను తీసుకెళ్లి ఎవరికో అనారోగ్యమైతే అతని చేతుల్లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు లక్షలు కాకుండా, మరో రెండు లక్షలు అదనంగా అతనికి ఇచ్చాడు. ఈరోజు ఆ నాలుగు లక్షలు చేతుల్లో ఉండుంటే, ఆయన చికిత్స కు ఉపయోగపడేవి. అన్ని ఆయన ఇలాంటి పనులే చేస్తుంటాడు’ అంటూ ఫిష్ వెంకట్ భార్య వాపోయింది.
Also Read:అది నాని డెడికేషన్… మేటర్ తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు!
తనకు అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎదుటి వ్యక్తి కి బాగాలేదని తెలిసి వాళ్లకు సహాయం చేయడమంటే చిన్న విషయం కాదు, ఎంతో గొప్ప మనసు ఉండాలి అంటూ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతీ ఒక్కరు భాదతో నిండిన హృదయం తో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫిష్ వెంకట్ గురించి చాలానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం తో మొదలైన ఫిష్ వెంకట్ సినీ ప్రస్థానం, అతి తక్కువ సమయంలోనే ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఏడాదికి ఫిష్ వెంకట్ కనీసం 20 సినిమాల్లో అయినా నటించేవాడు. అంత బిజీ గా ఉంటున్న ఆయనకు అనారోగ్యం కారణంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కోలుకొని సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు, కానీ ఇంతలోపే ఇలా జరగడం దురదృష్టకరం.