Jagan Fans: రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. కాకపోతే ఒకప్పుడు ఇది అంతగా వెలుగులోకి వచ్చేది కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మీడియా అనేది విస్తృతమైన తర్వాత రాజకీయ నాయకుల అభిమాన గణం ఎంత బలంగా ఉందో అర్థం అవుతున్నది. అయితే ఇందులో ఫేక్ అభిమాన గణం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో తర్వాత గాని అర్థం కాదు. కాకపోతే అప్పటివరకు ఈ సానుకూల ప్రచారాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు. అవసరమైతే ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకుంటారు. అభిమానం ఎంత ఉన్నప్పటికీ.. అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అంతిమంగా ఓటు రూపంలో వచ్చినప్పుడే రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది. పదవి లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని పిఆర్ స్టంట్స్ చేసినా ఉపయోగ ఉండదు.
Also Read: పెళ్లిలో అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఇక ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ మొదలైంది పండగ చేసుకోండి
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత.. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన తర్వాత వైసిపి అధినేత జగన్ కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బయటికి వస్తున్నారు. వరుస పర్యటనలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పరామర్శ యాత్రల పేరుతో ఆయన తన పార్టీని పటిష్టం చేసుకుంటున్నారు. వాస్తవానికి 2019 నుంచి 24 వరకు ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగారు. ఈ సందర్భంగా అనేక పథకాలు అమలు చేశారు. పథకాల అమల్లో గొప్పతనాన్ని ప్రదర్శించామని జగన్ చెబితే.. అందులో మొత్తం కోతలే ఉన్నాయని టిడిపి నేతలు విమర్శించారు. ఇవి ఎలా ఉన్నప్పటికీ తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ భావించారు. కానీ ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ తర్వాత వరుసగా అరెస్టులకు పాల్పడుతోంది. ఇప్పటికే వైసీపీ చెందిన కీలక నాయకులు జైల్లో ఉన్నారు. ఒకప్పుడు జగన్ తో ఉన్నవారు ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు.
తనతో ఎవరు ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం తాను ఉన్నానని జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. అంతకుముందు పొగాకు రైతులను పరామర్శించారు. తాజాగా మామిడి రైతులను కూడా ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా వచ్చారు. ఓ వైపు పోలీసులు తక్కువ మందితో కార్యక్రమ నిర్వహించుకోవాలని చెబితే.. వైసిపి నాయకులు మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా జన సమీకరణ చేపడుతున్నారు. భారీగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. ఇక వచ్చిన జనాలు డాన్సులు వేయడం… గోలలు చేయడంతో పోలీసులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. వారందరినీ కంట్రోల్ చేయాలంటే వారి వల్ల కావడం లేదు. ఇక ఈ వీడియోలను వైసిపి అనుకూల వ్యక్తులు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. సంద్రాన్ని ఆపడం.. పోలీసుల వల్ల కాదు. కూటమినేతల వల్ల కూడా కాదు. ఇది జగన్ బలం. జగన్ కు ఉన్నది ప్రజాబలం. మూడు పార్టీలు ఏకమైనా సరే జగన్ ను తట్టుకోలేకపోతున్నాయి. 11 స్థానాలు వచ్చినా సరే ఆయనను చూసి భయపడుతున్నాయని వైసిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ఈ వీడియోల పట్ల టిడిపి నాయకులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. మద్యం తాగించి.. ఇలా పిచ్చిగా ప్రవర్తించేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ.. రోడ్లపై మామిడికాయలను పోసి తొక్కిస్తూ పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావాలని స్పష్టం చేస్తున్నారు.