
తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ వకీల్ సాబ్ హవా కొనసాగుతోంది. అన్ని వర్గాల నుంచీ పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవ్. ఇక, సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు వకీల్ సాబ్.
సినిమాలో పవన్ పెర్ఫార్మెన్స్ ఎవరెస్టును తాకుతోందని అంటున్నారు. వెండితెర మొత్తాన్ని ఆక్రమించిన పవర్ స్టార్.. వకీల్ సాబ్ గా విశ్వరూపం ప్రదర్శించాడని అంటున్నారు. ప్రధానంగా కోర్టు సీన్లు దద్దరిల్లిపోయాయని చెబుతున్నారు. పవర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటిగా మిగిలిపోతుందనే టాక్ వస్తోంది.
అయితే.. మొదటి నుంచీ చివరకు అద్భుతంగా సాగిపోయే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అడ్డంకిగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే కంప్లైంట్ చేస్తున్నారట. శృతిహాసన్ – పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదని అంటున్నారు.
అందుకే.. సినిమాలోని ఆ ఎపిసోడ్ ను కట్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజుకు సైతం విన్నవించినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఆ ఎపిసోడే సినిమాకు కీలకంగా ఉంది. ఆ ఎపిసోడ్ మూలంగానే వకీల్ సాబ్ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. అందువల్ల.. ఆ ఎపిసోడ్ ను తీసేయడానికి అవకాశమే లేదు. కాబట్టి.. ఆ ఎపిసోడ్ వరకు లైట్ తీసుకోవాల్సిందే.