Pawan Kalyan: టాలీవుడ్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేయి ఎత్తితే చాలు ఏదైనా చేసేందుకు సిద్ధమైపోతుంటారు ఫ్యాన్స్. ఆయనకు వాళ్లు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు భక్తులు కూడా. ఏదైనా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆరోజు మాస్ జాతరే.. ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా ఆయన రేంజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్.. ఇప్పటికీ లేని వాళ్లకు తోచినంత సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మందిని ఆదుకున్నారు.

Also Read: పవన్ అక్కగా మారనున్న ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ !
అయితే, పవన్ ఫ్యాన్స్ టాలీవుడ్‌పై సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ని టాలీవుడ్ కేవలం అవసరానికే వాడుకుంటోందని అంటున్నారు. పవన్ చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తను ఎదురుండి పోరాడారు. అప్పుడు ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పవన్‌కు మద్దతుగా నిలవలేదు. కనీసం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఆపింది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు భీమ్లానాయక్ సినమా వాయిదా వేయమని అడగడం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇప్పుడు కూడా ఆయన మంచి మనసుతోనే సినిమా వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. దీన్ని బట్టి టాలీవుడ్ పవన్‌ను వాడుకోవాలని చూస్తోందని అర్థమవుతోందని బాధపడుతున్నారు. భీమ్లానాయక్‌తో పాటు ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు ఒకేసారి రంగంలోకి దిగనుండటంతో.. స్క్రీన్ షేరింగ్ విషయంలో సమస్యలు తలెత్తకుండా భీమ్లా నాయక్ తప్పుకుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: 2024 ఎన్నికల్లో పవన్ పవర్‌ఫుల్ అస్త్రాన్ని వాడబోతున్నారా.. అందుకే ధైర్యంగా ఉన్నారా?