Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయాలనీ చూస్తోంది టీమ్.

అలాగే ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం. మరోపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: హిజాబ్ వ్వవహారంలో బాధ్యులపై చర్యలుంటాయా?
ఇక భీమ్లా నాయక్ నుండి తదుపరి పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ రోజు సాయంత్రం రివీల్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయట. పైగా థమన్ ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి ఒక అప్ డేట్ ఇస్తూ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని చెప్పుకొచ్చాడు.

కాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం థమన్ బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా పవన్ నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
[…] ఇక అహంకారం, డబ్బు ఉన్న వ్యక్తికి అలాగే ఆత్మ గౌరవంతో పనిచేసే పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కతోంది. ఈ రెండు పాత్రలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు ఉంటాడు అవతలి వ్యక్తి. అందుకే రాణాను ఇందులో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయినా పవన్ పదిమెట్లు పైనే ఉంటాడనే ప్రచారాన్ని దగ్గుబాటి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇందులో రాణా పాత్రను ఏ మేరకు చూపిస్తారో అన్నది చూడాలి. Also Read: Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ డబ్బింగ్ పూర్తి … […]