Son of India Movie Bookings: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎలక్షన్స్ అప్పటి నుంచే మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కాగా ఇప్పుడు మరోసారి మోహన్ బాబు గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ ఆయన నటించిన మూవీ సన్ ఆఫ్ ఇండియా. దీన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రత్నబాబు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.

అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు కలెక్షన్ల వరద పారించిన మోహన్ బాబు మూవీ అంటే ఎంతో కొంత బజ్ ఉండాలి. కానీ ఈ మూవీకి అదే మిస్ అయిపోయింది. చడీ చప్పుడు లేకుండా వచ్చిన చిన్న సినిమా లాగా అయిపోయింది. పాటలు గానీ, ప్రమోషన్లు గానీ పెద్దగా లేకపోవడంతో దీన్ని ఎవరూ పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదు. అయితే ఈ గ్యాప్ లోనే 18న మూవీ రిలీజ్ అయిపోయింది.

Also Read: Mohan Babu Son Of India: ప్చ్.. కలెక్షన్ కింగ్ సినిమా కలెక్షన్లు వందల్లోనే !
కాగా ఏపీలో మొదటి రోజు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. కానీ దీనికి బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. 50శాతంలో ఒక్క శాతం బుకింగ్స్ కూడా జరగట్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హిస్టరీలోనే ఇది దారుణ పరిస్థితిగానే చెప్పాలి. సన్ ఆఫ్ ఇండియా సినిమాకు ఇప్పటి వరకు 100 టికెట్లు కూడా అమ్ముడు పోలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 265 థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. దీని రన్ టైం కూడా ఒకటిన్నర గంటలు ఉండటం ఇక్కడ విశేషం. ఇంత తక్కువ టైమ్ ఉన్నా కూడా.. దీన్ని ఎవరూ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఇప్పడు ఓ చర్చ జరుగుతోంది. ఇంత దారుణంగా బుకింగ్స్ ఉండే బదులు.. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినా ఎంతో కొంత గౌరవంగా ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.