Homeఎంటర్టైన్మెంట్పవన్ బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం అక్కడే !

పవన్ బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం అక్కడే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ అక్టోబర్ 23న నుండి మొదలైన సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ కల్లా ఈ సినిమా మొత్తం పూర్తి చేయాలని దాదాపు 30 రోజుల డేట్స్ ను పవన్ కేటాయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రోజు నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో షూట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ […]

Vakeel Saab Movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ అక్టోబర్ 23న నుండి మొదలైన సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ కల్లా ఈ సినిమా మొత్తం పూర్తి చేయాలని దాదాపు 30 రోజుల డేట్స్ ను పవన్ కేటాయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రోజు నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో షూట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం వేస్తోన్న కొత్త సెట్స్ లోనే పూర్తి చేయనున్నారు. అందుకే దిల్ రాజు ఫిల్మ్ సిటీలోనే ఉండి షూటింగ్ కి అన్ని రెడీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

నిజానికి ఈ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే ఎప్పుడో జూన్ లోనే రిలీజ్ అయి.. ఈ పాటికి టీవీల్లో కూడా వచ్చేసేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు మధ్యలోనే ఆగి.. దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది ఈ సినిమా. ఆయినా ఈ సినిమా పై అంచనాలు మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకూ సినిమా పై హైప్ ఎక్కువ అవుతూనే ఉంది. అన్నట్టు సెట్ లో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. పవన్ కూడా షూట్ లో పాల్గొంటానికి ముందు అన్ని చెక్ చేసుకుని సెట్ కి వస్తున్నాడట.

Also Read: డైరెక్టర్లకు ‘బాలయ్య’ నుండి మెసేజ్ !

నిజానికి మొదట పవన్ డిసెంబర్ వరకూ ఎలాంటి షూట్స్ వద్దు అని అనుకున్నాడు. కానీ దిల్ రాజు రిక్వెస్ట్ చేయడంతో పవన్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట. అదేవిధంగా పవన్ కోసం యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ యాడ్ చాలా ఎఫెక్టివ్ గా యాడ్ చేశారట. మరి చూడాలి.. పవన్ కి వకీల్ సాబ్ ఎలాంటి హిట్ ఇస్తోందో..!

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper