https://oktelugu.com/

Pavitra Lokesh: ‘‘నరేష్ ఎనర్జీ 10 మందితో సమానం.. రాత్రయితే నా వల్ల కావడం లేదన్న పవిత్ర..’’ వీడియోతో ఆడుకుంటున్న నెటిజన్లు

ఇప్పుడు ఇక సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం(పెళ్లి చేసుకున్నారని టాక్) కొనసాగిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర.. రెండు మూడు రోజుల క్రితం ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ.. " నరేష్ ఎనర్జీ 10 మందితో సమానం. రాత్రి అయిన తర్వాత ఇక నా వల్ల కాదంటూ చెప్పేస్తానని" వ్యాఖ్యానించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 21, 2025 / 11:23 AM IST
    Pavitra Lokesh

    Pavitra Lokesh

    Follow us on

    Pavitra Lokesh: ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ చాలామంది సెలబ్రిటీల ఇళ్లు కాలిపోయాయి. వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుంది. దీంతో మంటలనుంచి తమ ఆస్తులను కాపాడుకోవడానికి అక్కడ సెలబ్రిటీలు స్థానికంగా ఉన్న నది వనరుల నుంచి నీళ్లను హెలికాప్టర్ల ద్వారా సేకరించి చల్లించారు. ఇది సహజంగానే అక్కడ ప్రజలకు కోపం తెప్పించింది. దీంతో సెలబ్రిటీలు తోక ముడువక తప్పలేదు.

    అప్పటిదాకా హాలీవుడ్ హీరోలను.. హీరోయిన్లను గొప్పగా ఆరాధించిన వాళ్లే.. తమకు కష్టం వస్తే చల్ హట్ ఎవర్రా మీరంతా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్టుగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ప్రజలకు ఒళ్లు మండితే సెలబ్రిటీలు ఉండరు.. స్టారాధిష్టారులు అస్సలు ఉండరు. సమాజం ఎంతో కొంత గుర్తింపు ఇచ్చినప్పుడు సెలబ్రిటీలు దానిని కాపాడుకోవాలి. దానిని వారి చేష్టలతో మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప సెలబ్రిటీల మనే గర్వంతో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ తర్వాత నేలకు దిగిపోవడం ఖాయం. ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సంక్రాంతికి ఆంధ్ర ప్రజలు సినిమాకు వైబ్ ఇస్తారు.. తెలంగాణలో అయితే తెల్ల కల్లుకు, మటన్ ముక్కలకు ప్రయారిటీ ఇస్తారు” అని వ్యాఖ్యానించాడు. అంతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాలేదు గాని.. ఆ ప్రభావం గేమ్ చేంజర్ సినిమా పై పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    ఇప్పుడు ఇక సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం(పెళ్లి చేసుకున్నారని టాక్) కొనసాగిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర.. రెండు మూడు రోజుల క్రితం ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ” నరేష్ ఎనర్జీ 10 మందితో సమానం. రాత్రి అయిన తర్వాత ఇక నా వల్ల కాదంటూ చెప్పేస్తానని” వ్యాఖ్యానించింది. ఆ మాటలకు ముందు పవిత్ర లోకేష్ ఏం మాట్లాడిందో.. ఎందుకు అలా మాట్లాడిందో.. ఎవరికీ అవసరం లేదు.. జస్ట్ పది మందితో సమానమైన విజయం.. రాత్రి అయితే నా వల్ల కాదని చెప్తాననే మాటలు మాత్రమే ఉండేలా కట్ చేసి వీడియో సోషల్ మీడియాలో వదిలిపడేశారు. ఇంకేముంది కావలసినంత రచ్చ.. జరగాల్సిన చర్చ.. జరుగుతూనే ఉంది. పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటలకు దెబ్బకు అమెరికా డోనాల్డ్ ప్రమాణ స్వీకార పర్వం కూడా వెనక్కి పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా నేటి కాలంలో సెలబ్రిటీలు.. సెలబ్రిటీలు లాగా ఉండడం లేదు. వారు కూడా బీ గ్రేడ్ స్థాయిలో మాట్లాడుతున్నారు. విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. చివరికి పడకగది ముచ్చట్లను కూడా చెప్పకుండా ఉండడం లేదు. అయినా ఇలాంటి వారిని మన సమాజం సెలబ్రిటీలు అని గౌరవిస్తుంది. చివరికి వారి కటౌట్లు పెట్టి మేకపోతులను బలిస్తోంది. పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తోంది..

     

    *నిజానికి పవిత్ర మాటల్లో నరేష్ యాక్టింగ్ సిన్సియారిటీ, డెడికేషన్ ను కొనియాడారు. కానీ కొందరు యూట్యూబర్స్, నెటిజన్లు కేవలం రాత్రి అలిసిపోతాను అన్న పవిత్ర మాటలను కట్ చేసి వైరల్ చేస్తున్నారు. సెలబ్రెటీల పరువు తీస్తున్నారు. నరేష్ గొప్పతనంపై పవిత్ర మాట్లాడితే దాన్ని కూడా కొందరు నెటిజన్లు ఇలా వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి..

    అసలు ఈ వైరల్ వీడియోలో నరేష్ గురించి పవిత్ర ఎంత పాజిటివ్ కోణంలో చెప్పిందో ఈ ఫుల్ వీడియోలో చూద్దాం..