https://oktelugu.com/

Jawan Song: జవాన్ పాటకు హాస్పిటల్ లో పేషెంట్ డాన్స్… షారుఖ్ ఎపిక్ రిప్లై!

జవాన్ చిత్రంలోని చెలియా సాంగ్ బాగా పాప్యులర్ అయ్యింది. ఫ్యాన్స్ తో పాటు సెలెబ్స్ కూడా ఈ పాటకు కాలు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ యువతి ఈ చెలియా సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : September 16, 2023 / 01:03 PM IST

    Jawan Song

    Follow us on

    Jawan Song: జవాన్ వరల్డ్ వైడ్ వసూళ్లు దుమ్ముదులుపుతుంది. యూఎస్ లో $ 10 మిలియన్ వసూళ్లు క్రాస్ చేసిన ఈ చిత్రం డొమెస్టిక్ గా రూ. 350 కోట్ల వసూళ్లు సాధించింది. పఠాన్, జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. షారుఖ్ ఖాన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. కాగా జవాన్ మూవీలోని చెలియా సాంగ్ కి ఆసుపత్రిలో పేషేంట్ గా ఉన్న లేడీ అభిమాని డాన్స్ చేయడం విశేషంగా మారింది.

    జవాన్ చిత్రంలోని చెలియా సాంగ్ బాగా పాప్యులర్ అయ్యింది. ఫ్యాన్స్ తో పాటు సెలెబ్స్ కూడా ఈ పాటకు కాలు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ యువతి ఈ చెలియా సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ వీడియో షారుఖ్ ఖాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒక విధంగా ఆయన ఫిదా అయ్యారు. సదరు లేడీ అభిమానికి ఆయన రిప్లై ఇచ్చారు.

    నీ డాన్స్ నాకు బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది. నువ్వు త్వరగా కోలుకుని జవాన్ సినిమా చూడాలని ఆశిస్తున్నాను. ఆరోగ్యం కుదుటపడ్డాక నువ్వు మరొక వీడియో చేయాలి. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ ట్వీట్ వైరల్ అవుతుంది. అభిమానులు చూపించే ప్రేమకు ఆయన స్పందించిన తీరు గొప్పగా ఉందని నెటిజెన్స్ అంటున్నారు.

    జవాన్ చిత్రానికి అట్లీ దర్శకుడు. తమిళంలో తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన అట్లీ జవాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. జవాన్ మూవీలో ప్రధాన పాత్రలు సౌత్ స్టార్స్ చేయడం విశేషం. హీరోయిన్ గా నయనతార నటించింది. ప్రధాన విలన్ రోల్ విజయ్ సేతుపతి చేశాడు. ప్రియమణి మరొక కీలక పాత్ర చేయడమైంది. అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.