https://oktelugu.com/

Sonu Sood Family: సోనూసూద్ ఫ్యామిలీ ఫొటోలు వైరల్.. ఆయన పిల్లలు ఎలా ఉన్నారో చూస్తారా?

పంజాబ్ కు చెందిన సోనూసుద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని కోరిక ఉండేది. ఈ ప్రయత్నాల్లో 1999లో ‘కుళ్లళలగర్’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2023 / 01:07 PM IST

    Sonu Sood Family

    Follow us on

    Sonu Sood Family: ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులకు సక్సెస్ వేదికగా మారింది. ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా మంది ఒక్కసారి తెలుగు సినిమాలో కనిపిస్తే చాలు తమ జీవితం మారిపోతుందని అనుకుంటున్నారు. అలా చాలా మంది నటులు, నటీమణులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత మిగతా పరిశ్రమల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సోనూ సుద్ అక్కడున్నంత కాలం ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలుగులో నటించిన తరువాత ఈయన ఫేమస్ అయ్యాడు. కేవలం నటుడిగానే కాకుండా ఆపద్భాంధవుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సోనూ సుద్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    పంజాబ్ కు చెందిన సోనూసుద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని కోరిక ఉండేది. ఈ ప్రయత్నాల్లో 1999లో ‘కుళ్లళలగర్’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత మరో తమిళ సినిమాలో నటించాడు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించడంతో ఆయన విలన్ పాత్రలకు షూటవుతారని కొందరు అనుకున్నారు. అయితే ఇంతలో తెలుగులో ‘అమ్మాలు, అబ్బాయిలు’ అనే సినిమాలో విలన్ పాత్ర వేశారు. కానీ ఆ తరువాత అక్కినేని నాగార్జున తో కలిసి ‘సూపర్’ సినిమాలో నటించిన తరువాత అందరికీ పరిచయం అయ్యారు.

    ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అరుంధతి’ సినిమాకు సోనూసుద్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు రావడమే కాకుండా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా తెచ్చింది. అయితే అంతకుముందే సోనూసుద్ 2002లో హిందీలో ‘షాహిద్ ఏ అజం’లో నటించాడు. కానీ తెలుగు‘అరుంధతి’తో స్టార్ అయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా తెలుగులోనే పలు సినిమాల్లో విలన్ పాత్ర వేశాడు.

    ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న సోనూసుద్ కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి ఆపద్భాంధవుడిగా నిలిచారు. కరోనా సమయంలో ట్రాన్స్ పోర్ట్ క్లోజ్ కావడంతో సొంతంగా బస్సులను పెట్టి చాలా మందిని సొంత గ్రామాలకు తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఏదైనా ఆపద వచ్చినా తన ఇంటి తలుపు తట్టాలని ఓ నెంబర్ కూడా ఇచ్చాడు.

    ఏపీ చెందిన కొందరు డబ్బుల్లేక కాడేడ్లుగా మారిన పరిస్థితిని చూసి చలించిన సోనూసుద్ వారికి ట్రాక్టర్ కొనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను దేవుడిగా కొలిచారు. సోనూసుద్ చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కాదని సోనూసుద్ కు పాలాభిషేకం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    సోనూసుద్ కు సతీమణి పేరు సోనాలి సూద్. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు ఇషాంత్ సూద్, మరొకరు అయాన్ సుద్. ఇటీవల సోనూసుద్ ఫ్యామిలీ బ్యాంకాక్ టూర్ కు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోనూసుద్ ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఈ ఫొటోలకు ఆయన అభిమానులు లైక్స్ కొట్టడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో సోనూసుద్ ఓ చెట్టును పట్టుకొని ఫీట్లు చేయడం అందరినీ అలరిస్తోంది.