Paradise : దసర (Dasara) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ప్రస్తుతం ఆయన నాని (Nani) ని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక వరుసగా రెండో సినిమా కూడా నానితోనే చేయడం పట్ల పలువురు సినిమా మేధావులు అతని మీద ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. దసర(dasara) సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపినందుకే నాని తన మీద పూర్తి బాధ్యతను ఉంచి ప్యారడైజ్ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నాని తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం భారీ కసరత్తులను చేస్తూ సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో ఆయన భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్యారడైజ్ లో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్న స్టార్ హీరో…
ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని టైర్ వన్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు.
కానీ మొత్తానికైతే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా ఈ న్యూస్ బయటకు వస్తే గాని ఒక క్లారిటీ అయితే రాదు. ఇక శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమా తర్వాత చిరంజీవి(Chiranjeevi) తో చేయబోతున్న సినిమా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ప్రతి దర్శకుడు చిరంజీవితో తన ఎంటైర్ కెరియర్ లో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం శ్రీకాంత్ ఓదెలకు దక్కిందనే చెప్పాలి.
Also Read : ప్యారడైజ్ మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారా..?