Paradise : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్ ‘ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ ను హైదరాబాద్ నగర శివార్లల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇందులో పొందుపరుస్తూ ఒకప్పుడు హైదరాబాదులో ప్యారడైజ్ అనే ఏరియా ఎలా ఉండేది. అక్కడి బ్రతుకులు ఎలా ఉండేవి అనేది చూపించడానికి ఈ సెట్ అయితే వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులోనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి రెండు ఫైట్స్ ని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి నాని కనక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం ఆయన మాస్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : పెద్ది కోసం ప్యారడైజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల…కారణం ఏంటంటే..?
ఇక ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్ లో వచ్చిన దసర (Dasara) సినిమా భారీ విజయాన్ని సాధించింది. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాగా ఈ సినిమాకి మంచి గుర్తింపైతే ఉంది. మరి వీళ్ళ కాంబినేషన్ ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా మాస్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.
ఇక రాబోయే సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట భారీ సక్సెస్ లను సాధించడం అతని వల్ల అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక సుకుమార్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
మరి సుకుమార్ (Sukumar) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం అతని శిష్యులు టాప్ డైరెక్టర్స్ గా ఎదుగుతున్న క్రమంలో ఆయన కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి గురువును మించిన శిష్యుడిగా శ్రీకాంత్ మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ప్యారడైజ్ సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : ఒక్కరోజు గ్యాప్ లో రానున్న’పెద్ది’, ‘ది ప్యారడైజ్’..నాని వెనక్కి వెళ్ళక తప్పదా?