Panchayat 4 Update: ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటి ‘పంచాయత్’. మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ఇప్పుడు నాల్గవ సీజన్(Panchayat 4) తో మన ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో రీసెంట్ గానే అప్లోడ్ అయినా ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక వెబ్ సిరీస్ ద్వారా ‘శాన్విక'(Shanvika) అనే అమ్మాయి మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఇందులో ఆమె రింకి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శాన్విక, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను పంచుకుంది. అవి విన్న తర్వాత ఇలాంటి గొప్ప మూవీ టీమ్స్ కూడా ఇండస్ట్రీ లో ఉంటాయా అని అనిపించక తప్పదు.
Also Read: Shraddha Srinath Vacation Photos: అనుకోని ట్విస్ట్.. శ్రద్ధా ఏంటి ఇలా తయారు అయింది
ఆమె మాట్లాడుతూ ‘ఈ సిరీస్ కథ నాకు చెప్పినప్పుడు ఉన్న సన్నివేశాలు కాకుండా, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. మార్చిన కథలో ఒక ముద్దు సన్నివేశం ఉంటుంది. డైరెక్టర్ ఆ సన్నివేశం గురించి అడిగినప్పుడు నాకు ఈ సన్నివేశం లో నటించాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి రెండు రోజుల సమయం కావాలని కోరాను. ఈ సిరీస్ ని అన్ని వర్గాల ప్రేక్షకులు,కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని చూస్తారు. అలాంటి సిరీస్ లో ఇలాంటి ముద్దు సన్నివేశాలు పెడితే వాళ్ళు ఇబ్బందికి గురి అవుతారని అలోచించి, ఈ సన్నివేశం లో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని డైరెక్టర్ కి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి. భయపడుతూనే నా వల్ల కాదు సార్ అని చెప్పాను. కానీ మేకర్స్ అందుకు నన్ను ఎలాంటి బలవంతం చేయలేదు’
‘ఏమి పర్వాలేదు..ఆ సన్నివేశానికి బదులుగా మరో సన్నివేశాన్ని రాస్తామని చెప్పారు. ఇంత గొప్ప టీం ఎక్కడ ఉంటుంది చెప్పండి. వాళ్ళతో కలిసి పని చేయడం నేను చేసుకున్న అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది శాన్విక. ఆమె చెప్పింది ముమ్మాటికీ నిజమే. శాన్విక పెద్ద స్టార్ హీరోయిన్ ఏమి కాదు,ఇదే ఆమె తొలిసారి కెమెరా ని ఎదురుకోవడం. దానికి తోడు ఆమెకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ కూడా లేదు. ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన అమ్మాయిలను నిర్మాతలు,దర్శకులు ఎలా ట్రీట్ చేస్తారో గతంలో మనం ఎన్నో సందర్భాలు చూసాము. వాళ్ళు చెప్పింది కచ్చితంగా చెయ్యాల్సిందే, లేకపోతే సినిమా నుండి పీకేయడమో, బలవంతంగా తిట్టి,కొట్టి చేయించడంలో చేస్తుంటారు. అలా కాకుండా, అమ్మాయి కంఫర్ట్ జోన్ ని అర్థం చేసుకొని సన్నివేశాలను రీ రైట్ చేసుకొని రాయడం నిజంగా గొప్ప విషయమే.
Slow-burn-old school Romance>>
Inka toh step by step progress hua hai phir v i need that kiss
The most beautiful scene 4m d entire season!
The purity/innocence this scene holds!
They hv such Natural chemistry!
Rinky & Sachiv ji❤️#SachivJi #panchayatseason4 #jitendrakumar pic.twitter.com/duYIkA1X3R— (@bitterheart26) June 25, 2025