Bigg Boss 7 Telugu: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ – యావర్ కుట్ర… షోకి రాకముందే అలా కలిసి!

అమర్ దీప్, ప్రియాంక, శోభ సీరియల్ బ్యాచ్ గా తయారయ్యారు. ఈ ముగ్గురు గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. దాంతో శివాజీ తన టీమ్ ని ఫార్మ్ చేసుకున్నాడు.

Written By: NARESH, Updated On : December 19, 2023 3:23 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్- యావర్ లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హౌస్లోకి రాకముందే వీరిద్దరూ స్కెచ్ వేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో శివాజీ, యావర్ లతో స్నేహం చేశాడు. శివాజీ వీరి గురువుగా వ్యవహరించారు. యావర్ కి తెలుగు రాదు, పల్లవి ప్రశాంత్ పల్లెటూరి వాతావరణంలో పెరిగిన రైతుబిడ్డ. వీరిద్దరూ మొదట్లో తడబడ్డారు. ఆ సమయంలో శివాజీ వాళ్ళకు అండగా నిలబడ్డాడు. మానసికంగా దృఢంగా చేశాడు.

అమర్ దీప్, ప్రియాంక, శోభ సీరియల్ బ్యాచ్ గా తయారయ్యారు. ఈ ముగ్గురు గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. దాంతో శివాజీ తన టీమ్ ని ఫార్మ్ చేసుకున్నాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ లు కలిసి స్పై బ్యాచ్ గా రూపొందారు. స్పా బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ గా బిగ్ బాస్ తెలుగు 7 సాగింది. యావర్ కి ప్రశాంత్ హౌస్లోకి వచ్చే వరకు తెలియదని అందరూ భావించారు. అది నిజం కాదని తెలిసిపోయింది. వీరిద్దరి పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. షోకి రాకముందు యావర్, ప్రశాంత్ కలిశారు. మాట్లాడుకున్నారు.

దీంతో కలిసి ఆడాలని ముందుగానే నిర్ణయించుకుని హౌస్లోకి వచ్చారనే ప్రచారం మొదలైంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే కుట్ర చేశారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారిద్దరూ నిజంగా ఎందుకు కలిశారు. ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియదు. హౌస్లో అడుగుపెట్టక ముందే ప్రశాంత్, యావర్ కలిశారన్నది మాత్రం నిజం. సీజన్ మొత్తం శివాజీ, యావర్, ప్రశాంత్ కలిసి ఆడారు. ఈ ముగ్గురు ఫైనల్ కి కూడా వెళ్లారు. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు.

యావర్ కి 4వ స్థానం దక్కింది. శివాజీ, ప్రశాంత్ టాప్ 3కి వెళ్లారు. శివాజీకి 3వ స్థానం దక్కింది. ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. స్పా బ్యాచ్ కి చెందిన అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ తో పాటు రూ. 35 లక్షల ప్రైజ్ మని, డైమండ్ నెక్లెస్, కారు బహుమతులుగా వచ్చాయి. ఇక పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి రూ. 1 లక్ష అట. 15 వారాలకు రూ. 15 లక్షలు అందుకున్నాడు.