Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సంచలనంగా మారాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ స్థాయి నుండి అతిపెద్ద రియాలిటీ షోలో ఫైనల్ కి వెళ్లే స్థాయికి ఎదిగాడు. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ ఫినాలే జరగనుంది. హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, యావర్, ప్రియాంక ఉన్నారు. టాప్ 6లో ఉన్న పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడం ఖాయం అంటున్నారు. మెజారిటీ అనధికార పోల్స్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అని తెలియజేస్తున్నాయి.
పల్లవి ప్రశాంత్ పై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. మొదట్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కొందరు పల్లవి ప్రశాంత్ సింపతీ గేమ్ ఆడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేశారు. ఆ విమర్శలు తిప్పికొడుతూ ప్రశాంత్ షోలో అనేక విజయాలు సాధించాడు . ఆట తీరుతో మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ చాలా సింపుల్ గా ఉంటాడు. అందరినీ గౌరవిస్తాడు. అందుకే అతడు టైటిల్ ఫేవరేట్ అయ్యాడు.
కాగా రైతుబిడ్డ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి నాగార్జున మొదటి రోజు ఒక మొక్కను ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అయితే దాన్ని ప్రశాంత్ సరిగా పట్టించుకోలేదు. దాంతో ఆ మొక్క చనిపోయింది. చనిపోయిన మొక్కను చూపించి నాగార్జున పల్లవి ప్రశాంత్ ని విమర్శించాడు. ఒక మొక్కను పెంచలేని వాడివి రైతుబిడ్డ ఎలా అవుతావని సీరియల్ అయ్యాడు. మరలా మరో మొక్కను పల్లవి ప్రశాంత్ కి ఇచ్చాడు.
ఆ మొక్కను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ప్రశాంత్. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ మొక్కను చూస్తాడు. ఆ మొక్కకు మొక్కుతాడు. బిగ్ బాస్ హౌస్లో ప్రశాంత్ కి అది ఒక దిన చర్య. అయితే ఒకరోజు కేవలం కండువా కప్పుకుని మొక్కకు పూజ చేయడానికి వచ్చాడు. ప్యాంటు లేకుండా తిరుగుతున్న పల్లవి ప్రశాంత్ ని యావర్, శివాజీ ఎగతాళి చేస్తారు. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.