Spy Batch: పల్లవి ప్రశాంత్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో స్పై బ్యాచ్ సంబరాల్లో మునిగింది. ఇక వారితో పాటు నయని పావని, శుభశ్రీ, టేస్టీ, తేజ, భోలే కూడా కలిశారు. ప్రస్తుతం వారి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ, ప్రశాంత్, యావర్ లు స్పై బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురి స్నేహం, అనుబంధానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే వీరికి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉంది.
మళ్ళీ ఈ ముగ్గురిని ఒకచోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా జైలుకు వెళ్ళాడు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ 48 గంటల్లో బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ తర్వాత చాలా రోజులకు శివాజీ,ప్రశాంత్, యావర్ కలిశారు. హౌస్ లో ఉన్నప్పుడు శివాజీ .. యావర్, ప్రశాంత్ లకు అండగా నిలిచాడు.
దీంతో వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తాజాగా ప్రశాంత్ జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ప్రశాంత్, యావర్ .. శివాజీ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఇంట్లో భోజనం చేశారట. ముగ్గురూ కలిసి ఓ లైవ్ వీడియో కూడా చేశారు. వీరితో నయని, శుభశ్రీ, టేస్టీ తేజ కూడా లైవ్ లో యాడ్ అయ్యారు.
అనంతరం వీరందరూ కలిసి భోలే ఇంటికి వెళ్లారు. భోలే వారికి ఆతిథ్యం ఇచ్చాడు. శివాజీ, నయని, శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్, తేజ, భోలే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక అందరూ కలిసి సరదాగా గడిపారు. ప్రశాంత్ భోలే ను ప్రేమగా హద్దుకుని ముద్దు పెట్టిన వీడియో ఒకటి షేర్ చేశాడు. ప్రస్తుతం స్పై బ్యాచ్ విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.